Pushpa Slits Fiance Throat : అందుకే.. పుష్ప తనకు కాబోయే భర్త గొంతు కోసింది-డీఎస్పీ సునీల్
కాబోయే భర్త గొంతు కోసిన పుష్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసుకి సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు.(Pushpa Slits Fiance Throat)

Woman Slits Fiance Throat
Pushpa Slits Fiance Throat : ఏపీలోని అనకాపల్లి జిల్లా రావికమతంలో ఓ యువతి తనకు కాబోయే భర్త గొంతు కోసి చంపాలని చూసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. పుష్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. పెళ్లి ఇష్టం లేకనే కాబోయే భర్తపై దారుణానికి పాల్పడిందని తెలిపారు. రామునాయుడు అనే యువకుడితో పుష్పకు మే 20న పెళ్లి నిశ్చయం చేశారని డీఎస్పీ సునీల్ వివరించారు.
Telangana : మైనర్ ప్రేమికులు ఆత్మహత్య- ప్రేమజంట వీడియో వైరల్
”పెద్దవాళ్ల అనుమతితో అమ్మాయి, అబ్బాయి స్కూటీపై బయటికి వచ్చారు. వడ్డాది దగ్గర స్కూటీ ఆపిన యువతి గిఫ్ట్ కొంటానని షాపులోకి వెళ్లింది. షాపులో ఏం కొన్నావని రామునాయుడు అడిగితే, పుష్ప సమాధానం చెప్పలేదు. అక్కడి నుంచి ఆ అబ్బాయిని విశ్వశాంతి జ్యోతిర్మయి ఆశ్రయం దగ్గరికి తీసుకెళ్లింది. గిఫ్ట్ ఇస్తాను కళ్లు మూసుకోమని పుష్ప చెప్పింది.(Pushpa Slits Fiance Throat)
Anakapalle : పెళ్లి ఇష్టం లేదని కాబోయే భర్త గొంతు కోసేసింది
అతడు సరిగా కళ్లు మూసుకోకపోవడంతో తన చున్నీ తీసి అతడి కళ్లకు గంతలు కట్టింది. ఆ తర్వాత తనతో తెచ్చుకున్న చాకుతో అబ్బాయి గొంతు కోసింది. ఆ తర్వాత పెళ్లి ఇష్టంలేకనే గొంతు కోసినట్టు అబ్బాయితో పుష్ప చెప్పింది. అయితే, పెళ్లి ఇష్టం లేదని అంటుండడంతో ఆత్మహత్య చేసుకుంటుందేమోనని ఆమెతో ఆ యువకుడు కూడా గాయంతోనే బయల్దేరాడు. ఆ యువకుడు గొంతు నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుండడం గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు” అని డీఎస్పీ వెల్లడించారు.
కాగా, ఎవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని ఆ యువతి చెప్పిందని, దైవ చింతనతో జీవితం గడపాలని ఆ యువతి భావిస్తోందని డీఎస్పీ వివరించారు. ఓం శాంతి ఆశ్రమంలో గడపాలని ఆమె కోరుకుంటోందన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆశ్రమంలో గడపడానికి పెద్దలు ఒప్పుకోరని భావించి కాబోయే భర్తపై దాడి చేసిందన్నారు. యువతిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని డీఎస్పీ సునీల్ చెప్పారు.(Pushpa Slits Fiance Throat)
కాగా, కాబోయే భర్త పీక కోసిన కేసులో పుష్ప నేరం ఒప్పుకుంది. తానే అతడి గొంతు కోశానంది. అంతేకాదు.. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వివరించింది. ‘రామునాయుడిని విశ్వశాంతి ఆశ్రమానికి తీసుకెళ్లాను. గిఫ్ట్ ఇస్తా కళ్లు మూసుకోమన్నా. అతను కళ్లు సరిగా మూసుకోలేదని కళ్లకు నా చున్నీ చుట్టాను. ఆ తర్వాత అతడి గొంతు కోశా. పెళ్లి ఇష్టం లేకనే గొంతు కోసినట్లు అతడితో చెప్పా. అతడు వెంటనే నన్ను బైక్ ఎక్కించుకున్నాడు. బైక్ పై వెళ్తుండగా దారిలో పడిపోయాడు. ఓ వ్యక్తి వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు” అని పోలీసులతో చెప్పింది పుష్ప.