AP Women Mlas: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. ఒకే రంగు దుస్తుల్లో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎందుకంటే..

రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నామని హోంమంత్రి అనిత తెలిపారు.

AP Women Mlas: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. ఒకే రంగు దుస్తుల్లో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎందుకంటే..

Updated On : September 23, 2025 / 7:12 PM IST

AP Women Mlas: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారంతా ఒకే కలర్ దుస్తుల్లో కనిపించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎరుపు రంగు దుస్తుల్లో అసెంబ్లీకి వచ్చారు. మహిళలంతా ఒకే డ్రెస్ కోడ్ లో కనిపించడం ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం ఏంటో మహిళా శాసనసభ్యులు స్వయంగా వివరించారు.

Women Mlas Assembly

ప్రస్తుతం నవరాత్రులు మొదలయ్యాయి. అమ్మవారిని భక్తశ్రద్ధలతో భక్తులు కొలుస్తున్నారు. అమ్మవారి ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలకరించి పూజలు చేస్తున్నారు. ఈ నవరాత్రుల్లో రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ క్రమంలో మహిళా శాసనసభ్యులు అమ్మవారి దీక్షా దుస్తుల్లో అసెంబ్లీకి వెళ్లారు.

AP Women Mlas Dress

ఈ నవరాత్రుల సందర్భంగా రోజూ అమ్మవారికి ఏ రంగు దుస్తులతో అలంకారం చేస్తారో అదే రంగు వస్త్రాల్లో అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు. మంగళవారం గాయత్రి దేవి అలంకారం. ఈ సందర్భంగా ఎరుపు రంగు దుస్తులు ధరించామన్నారు. రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలపై సందేశం ఇవ్వాలని ఈ డ్రెస్ కోడ్ పాటిస్తున్నామని ఆమె వివరించారు.

Women Mlas

Also Read: కార్యకర్తకు పెద్ద పదవి.. పవన్ కల్యాణ్ స్ట్రాటజీ అదేనా..?