Amaravati Project : 65వేల కోట్లతో అమరావతి ప్రాజెక్ట్.. భూమి పూజకు ప్రధాని మోదీకి ఆహ్వానం..!
2050 నాటికి 1.5 మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని, 3.5 మిలియన్ల జనాభాకు నిలయంగా ఉంటుందని, 35 బిలియన్ డాలర్ల GDPని కలిగి ఉంటుందని అంచనా.

Amaravati Project : ఏపీ రాజధాని అమరావతి నగర ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. 65వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. ప్రపంచ నగరాల నుండి ప్రేరణ పొందిన ఈ ప్రాజెక్ట్.. నైపుణ్యం కలిగిన వలసదారులను, వ్యాపారాలను ఆకర్షించడం, శక్తివంతమైన స్థిరమైన పట్టణ కేంద్రాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, గృహనిర్మాణం, విద్యా సంస్థలు ఉన్నాయి. రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తయ్యే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన వలసదారులు, పరిశ్రమలు, నిపుణులు, వ్యాపారాలను ఆకర్షించే ‘ప్రజల రాజధాని’ని నిర్మించాలనే ఉద్దేశ్యంతో కృష్ణా నది ఒడ్డున ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని 65వేల కోట్లతో అమరావతి నగర ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి. 2019 – 2024 మధ్య ఐదు సంవత్సరాల విరామం తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అమరావతి ప్రాజెక్టును పునరుద్ధరించింది.
అమ్ స్టర్ డ్యామ్, సింగపూర్, టోక్యో వంటి ప్రపంచ నగరాల నుండి ప్రేరణ పొందిన ప్రపంచ స్థాయి పట్టణ కేంద్రాన్ని నిర్మించే పని తిరిగి ప్రారంభమైంది. నగర శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రధాని ఆ ఆహ్వానాన్ని అంగీకరించారా లేదా, భూమి పూజ కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read : రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ పై ఘాటు విమర్శలు..
2014లో రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా నియమించారు. యూకేకి చెందిన ప్రఖ్యాత సంస్థ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ రూపొందించిన అమరావతి మాస్టర్ ప్లాన్, విజయవాడ గుంటూరు పట్టణాల మధ్య 217.23 చదరపు కిలోమీటర్లలో సమగ్ర అభివృద్ధిని ఊహించింది. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ నగరం ఈ ప్రాంతానికి ఆర్థిక కేంద్రంగా ఉంటుందని, 2050 నాటికి 1.5 మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని, 3.5 మిలియన్ల జనాభాకు నిలయంగా ఉంటుందని, 35 బిలియన్ డాలర్ల GDPని కలిగి ఉంటుందని అంచనా.
2024 లో అమరావతి అభివృద్ధి పనుల అంచనా బడ్జెట్ సుమారు రూ. 64,910 కోట్లు అని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ రాబోయే మూడేళ్లలో పూర్తవుతుందని వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ వ్యయంలో భారత ప్రభుత్వం 2024లో రూ. 15వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి 800 మిలియన్ల డాలర్ల సాయం అందించింది. KfWతో 5వేల కోట్లకు చర్చలు జరుగుతున్నాయి. 11వేల కోట్ల రుణాన్ని అందించడానికి హడ్కో ఇప్పటికే ఒప్పందంపై సంతకం చేసింది. 5వేల కోట్లకు సంబంధించి Kfw తో చర్చలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, ఆర్థికాభివృద్ధికి ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ఆకర్షించడానికి భారీ బ్రాండింగ్ కార్యక్రమాలను రూపొందిస్తోంది. PPP ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నారు. ప్రాజెక్టు దశ-1లో గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, విద్య, పారిశుధ్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read : ఏపీ రాజధాని కోసం మరో 44వేల ఎకరాలు.. ఈ గ్రామాల్లో భూసమీకరణకు ప్రభుత్వం కసరత్తు..
గృహ నిర్మాణ ప్రణాళిక కింద, ప్రభుత్వ అధికారుల కోసం 3,500 అపార్ట్‌మెంట్లు 200 బంగ్లాలు నిర్మాణంలో ఉండగా.. 5వేల మంది ఆర్థిక బలహీన వర్గాల (EWS) కుటుంబాలకు గృహాలను ప్రతిపాదించారు.
అమరావతిలో ఒక డెడికేటెడ్ నాల్డెజ్ సిటీకి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు SRM విశ్వవిద్యాలయం, అమృత విశ్వవిద్యాలయం, VIT విశ్వవిద్యాలయం, NID దాదాపు 22వేల మంది విద్యార్థులతో పనిచేస్తున్నాయి. అంతేకాకుండా BITS, XLRI, పుర్డ్యూ విశ్వవిద్యాలయం, టోక్యో విశ్వవిద్యాలయం, జార్జియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొదలైనవి స్థాపనకు క్యూలో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు ప్రణాళికలో ఉన్నావి..
ప్రభుత్వ కార్యాలయాలు
1,093 హెక్టార్లలో ప్రభుత్వ నగరం
న్యాయ సంస్థలకు కేంద్రంగా ఉండే 1,339 హెక్టార్ల జస్టిస్ సిటీ
వాణిజ్య నివాస స్థలాలతో ఆర్థిక కార్యకలాపాలను పెంచే లక్ష్యంతో 2,091 హెక్టార్ల ఫైనాన్స్ సిటీ.
ఎడ్యుకేషన్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, మీడియా సిటీ, టూరిజం సిటీ వంటి అదనపు రంగాలు కూడా బ్లూప్రింట్‌లో భాగంగా ఉన్నాయి.
APCRDA ప్రాజెక్ట్ ఆఫీస్ ఆరు నెలల్లో పూర్తవుతుంది, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు, న్యాయమూర్తులు, కార్యదర్శులు మొదలైన వారి నివాసాలతో సహా ప్రభుత్వ భవనాలు 18 నెలల్లో ప్రారంభం కానున్నాయి. శాసనసభ, హైకోర్టు వంటి ప్రభుత్వ కార్యాలయ భవనాలు 24 నెలల్లో, సచివాలయం 36 నెలల్లో పూర్తవుతాయి. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలు, ఆసుపత్రులు, బ్యాంకులు, పాఠశాలలు, ఇతర ప్రైవేట్ సంస్థలు ఒకటి లేదా రెండు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.