మండలి రద్దయినా..సెలెక్ట్ కమిటీ రద్దు కాదు – యనమల

  • Published By: madhu ,Published On : January 27, 2020 / 05:04 AM IST
మండలి రద్దయినా..సెలెక్ట్ కమిటీ రద్దు కాదు – యనమల

Updated On : January 27, 2020 / 5:04 AM IST

ఏపీ శాసన మండలి రద్దు కావడానికి చాలా సంవత్సరాలు పడుతుందని..అప్పటి వరకు కౌన్సిల్ ఉంటుందని, సెలెక్ట్ కమిటీ మాత్రం రద్దు కాదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల వ్యాఖ్యానించారు. 2020, జనవరి 27వ తేదీ సోమవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మండలి రద్దుకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ముందుకు తీసుకరానుంది ఏపీ ప్రభుత్వం. దీనిపై యనమలతో 10tv ముచ్చటించింది. 

సెలెక్ట్ కమిటీని ఎవరూ రద్దు చేయలేరు..మండలి రద్దు తీర్మానం కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళుతుందని, అనంతరం అక్కడి లా మినిస్టర్ తీర్మానాన్ని పరిశీలిస్తుందన్నారు. లోక్ సభ, రాజ్యసభలు ఆమోదించిన తర్వాత..రాష్ట్రపతి వద్దకు వెళుతుంది, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత మండలి రద్దు అవుతుందన్నారు. దీనికి చాలా సమయం పడుతుందని వెల్లడించారు. 

అసలు రూలింగ్ పార్టీ నిబంధనలు పాటించడం లేదని విమర్శించారు యనమల. ప్రొసిజర్ లేదు..వాళ్లిష్టం..కౌన్సిల్‌లో జరిగిన విషయాలను శాసనసభలో చర్చిస్తున్నారు..ఆ అధికారం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఒకతాటిపై ఉన్నారని..ఎలాంటి విషయాల్లో లొంగరని చెప్పారు యనమల.

Read More : మండలి రద్దుకు ఏపీ కేబినెట్ తీర్మానం