Andhra Pradesh : వైసీపీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో వైసీపీ 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు సీఎం వైఎఎస్ జగన్. పార్టీ మేనిఫెస్టోయే తమకు బైబిల్‌, భగవద్గీత, ఖురాన్‌గా...

Andhra Pradesh : వైసీపీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Ycp

Updated On : March 12, 2022 / 7:33 PM IST

YCP 12th Formation Day : వైసీపీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏపీలో ఘనంగా జరిగాయి. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ కార్యకర్తల నుంచి కీలక నేతల వరకు పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయాల ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆస్పత్రుల్లో రోగులకు పండ్లను, స్వీట్లను పంచిపెట్టారు. పలుచోట్ల అన్నదానాలు నిర్వహించారు.

Read More : DL Ravindra Reddy : అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదు-డీఎల్ షాకింగ్ కామెంట్స్

దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో వైసీపీ 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు సీఎం వైఎఎస్ జగన్. పార్టీ మేనిఫెస్టోయే తమకు బైబిల్‌, భగవద్గీత, ఖురాన్‌గా భావిస్తూ పనిచేస్తున్నామన్నారు. ఏపీని అభివృద్ధి పథంలో నడుపుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామన్నారు . ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు బాటలు వేస్తున్నామన్నారు జగన్. వైసీపీ సాకారం అవుతున్నాయన్నారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా పాలన కొనసాగిస్తున్నామన్నారు సీఎం జగన్ 2011 మార్చి 12న ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లోయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు వైఎస్‌ జగన్. పార్టీని అంచెలుఅంచెలుగా అభివృద్ధి చేసి ప్రజాభిమానాన్ని చూరగొని 2019లో అధికారంలోకి వచ్చారు సీఎం జగన్.