YCP MLA: వైసీపీ ఎమ్మెల్యేపై సొంతపార్టీ నేతల తిరుగుబాటు!

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే తిరగబడ్డారు.

YCP MLA: వైసీపీ ఎమ్మెల్యేపై సొంతపార్టీ నేతల తిరుగుబాటు!

Udayagiri

Updated On : October 18, 2021 / 1:47 PM IST

YCP MLA: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే తిరగబడ్డారు. ఇప్పటికే ఎంపీపీ ఎన్నికల వేళ తీవ్ర తిరుగుబాటు చూసిన ఎమ్మెల్యేకి మరోసారి సొంతపార్టీ నుంచి నిరసన సెగలు తగులుతున్నాయి.

ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అవినీతికి కేంద్ర బిందువుగా మారారని మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి సహా పలువురు నేతలు విమర్శలు గుప్పించారు.

ప్రతీ పనికీ రేటు కట్టి డబ్బులు దండుకుంటున్నారని సొంత పార్టీ స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్ట్‌ల నుంచి పార్టీ పదవుల వరకు రేటు కట్టి అమ్మేసుకుంటున్నారని, వింజమూరులో ఎమ్మెల్యే బి‌-ఫామ్ ఇచ్చిన వ్యక్తి కాక స్వతంత్రుడు ఎంపిపి అయ్యారని అన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో అప్పట్లో క్రియాశీలకంగా ఉన్నవాళ్లకు పదవులు ఇచ్చి అందలం ఎక్కించారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులని పక్కన పెట్టేశారని అన్నారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగుబాటు చేసినవారిలో జెడ్‌పీటీసీ రామాంజనేయులు, ఉదయగిరి నియోజకవర్గం ముఖ్యనేతలు పెద్దారెడ్డి సోమిరెడ్డి, రావిబోయిన శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీ ఉప్పుటూరు హరి రవీందర్ రెడ్డి ఉన్నారు