YCP Bus Yatra : వైసీపీ సామాజిక న్యాయ బస్సు యాత్ర.. మొదటి విడత షెడ్యూల్ విడుదల
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

YCP Bus Yatra
YCP Bus Yatra Schedule : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ సిద్ధమైంది. వైసీపీ బస్సు యాత్ర చేపట్టనుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించింది.
అక్టోబర్ 26న ఇచ్చాపురంలో వైసీపీ సామాజిక న్యాయ మొదటి విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. నవంబర్ 9న అనకాపల్లిలో మొదటి విడత బస్సుయాత్ర ముగియనుంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Telangana BJP : బీజేపీ తొలి జాబితాలో హేమాహేమీల పేర్లు మిస్.. వారంతా పార్లమెంట్ కేనా?
మొదటి విడత బస్సు యాత్ర ఇచ్చాపురంలో అక్టోబర్ 26వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నవంబర్ 9న అనకాపల్లిలో తొలి విడత యాత్ర ముగుస్తుందని తెలిపారు. రెండవ దశ బస్సుయాత్ర దీపావళి తర్వాత ఉంటుందని పేర్కొన్నారు.