Sadineni yamini : వైసీపీ నేతలూ..గురివింద గింజ సూక్తులు వద్దు,దమ్ముంటే డెవలప్‌మెంట్ గురించి మాట్లాడండి : సాదినేని యామిని కౌంటర్లు

వైసీపీ నేతలంటేనే డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. ప్రశ్నిస్తే కేసులు పెట్టటం..ఎదురు దాడి చేయటం తప్ప..డెవలప్ మెంట్ గురించి మాట్లాడటం మీకు చేతకాదు అంటూ ఎద్దేవా చేశారు.

Sadineni yamini : వైసీపీ నేతలూ..గురివింద గింజ సూక్తులు వద్దు,దమ్ముంటే డెవలప్‌మెంట్ గురించి మాట్లాడండి : సాదినేని యామిని కౌంటర్లు

sadineni yamini

Updated On : November 8, 2023 / 1:18 PM IST

sadineni yamini sharma  : ఆంధప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి రోజా వంటి నేతలు చేస్తున్న విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ తీవ్రంగా మండిపడ్డారు. దోపిడీలు చేస్తు నీతులు చెబుతున్న వైసీపీ నేతలు గిరివింద్ గింజ మాటలు మానుకోవాలి అంటూ సెటైర్లు వేశారు. మా అధ్యక్షురాలు పురందేశ్వరి గురించి మీరు మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలంటేనే డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు అంటూ ఎద్దేవా చేశారు. సీఎంజగన్మోహన్ రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే మా అధ్యక్షురాలిపై విమర్శలు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టటం..ఎదురు దాడి చేయటం తప్ప మరోకటి మీకు చేతకాదు అంటూ ఎద్దేవా చేశారు.

కల్తీ మద్యం తాగి పేదలు చనిపోయింది వాస్తవం కాదా..?మైనింగ్, ఇసుక ద్వారా కోట్లు దోచుకున్నది నిజం కాదా..? వీటి గురించి ప్రశ్నించిన ఆమెపై అర్థం పర్థం లేని విమర్శలు చేయటానికి సిగ్గుండాలి అంటూ మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు మీ పేర్లు పెట్టుకున్నారు..అదే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తుంటే ఓర్చుకోలేక దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.చెత్త నుంచి మరుగుదొడ్ల వరకు పన్నులు వసూళ్లూ చేస్తు ప్రజల్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. అధికంగా వస్తున్న విద్యుత్ బిల్లులతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారని కానీ ఇవేమీ ప్రభుత్వానికి పట్టవన్నారు.

Vijayasai Reddy : పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు .. ఈ సారి ఏమన్నారంటే..

మీ చేతకాని పాలనతో దేశంలోనే రాష్ట్రం పేరు చెడగొట్టారు అంటూ విమర్శించారు. మీ నాలుగురేళ్లపాలనలో మీరు చేసిన అభివృద్ధి ఎంత..? దానికి గురించి మాట్లాడే దప్ప చెప్పే ధైర్యం ఉందా
… మీకు అంటూ ప్రశ్నించారు.మీ అవినీతి గురించి పెద్ద చిట్టాయే ఉంది వాటి గురించి ప్రజలకు చెబుతున్నాం..వీటిపై చర్చకు రండి..లేదా సమాధానం చెప్పండి అంటూ డిమాండ్ చేశారు. కానీ సమాధానం చెప్పే ధైర్యం మీకెలాగూ లేదు..ఎందుకంటే వాటికి సమాధానం చెప్పలేకే మా అధ్యక్షురాలిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అంటూ ఎంపీ విజయసాయి రెడ్డిపై మండిపడ్డారు. విజయసాయి రెడ్డి, మంత్రులకు బుర్ర ఉండే మాట్లాడుతున్నారా? అంటూ ఎద్దేవా చేశారు.ఇలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి వారితో మాట్లాడిస్తున్నారా…?అని ప్రశ్నించారు.

Minister RK Roja : ఇలాంటి కూతురు ఉన్నందుకు ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఏడుస్తుంటారు- పురంధేశ్వరిపై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు

విజయసాయి రెడ్డి ఎవరో తెలియక ముందే పురందేశ్వరి ఎంపీ అయ్యారని ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంటూ చురకలు వేశారు.తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు దోచుకున్న చరిత్ర జగన్ ది..ఎన్టీఆర్‌ సిఎంగా ఉన్నా…‌ ఒక్క అవినీతి మచ్చ మా నాయకురాలి మీద లేదన్నారు. బీజేపీ అడిగిన వాటికి సమాధానం చెప్పే దమ్ము ఉందా..? పైగా బెదిరించేలా మా మహిళా నేతపై వ్యాఖ్యలు చేస్తారా..?మీ నిజాయితీ నిరూపించుకునే ధైర్యం ఉందా..? అంటూ మండిపడ్డారు. ఇంకోసారి నోరు పారేసుకుంటే .. మహిళలమే విజయసాయి రెడ్డికి తగిన బుద్ధి చెబుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.