Vijayasai Reddy : పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు .. ఈ సారి ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు, సెటైర్లతో విరుచుకుపడ్డారు.

Vijayasai Reddy : పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు .. ఈ సారి ఏమన్నారంటే..

Vijayasai Reddy Sensational Comments to Purandeswari

Updated On : November 8, 2023 / 12:09 PM IST

YCP MP Vijayasai Reddy  : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు, సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఇప్పటికే విజయసాయి రెడ్డి ఆమెపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలసిందే. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా వైసీపీ ప్రభుత్వంపై ఆమె ఇటీవల కాలంలో ఘాటు విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు ఆమెపై ఎదురుదాడి చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం విజయసాయి ‘ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరావు.. చంద్రబాబుకు కత్తి అందించారు’అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా పురందేశ్వరిపై ట్విట్టర్ వేదికగా వరుసగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న క్రమంలో టీడీపీతో బీజేపీకి పొత్తులేకున్నా సొంత పార్టీని గాలికొదిలేసి సైకిల్ పార్టీని తలకెత్తుకున్నారని వ్యాఖ్యానించారు.

Minister RK Roja : ఇలాంటి కూతురు ఉన్నందుకు ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఏడుస్తుంటారు- పురంధేశ్వరిపై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు

ఈ క్రమంలో ఈరోజు మరోసారి విమర్శలు సంధించారు. మీపై రాష్ట్ర ప్రజలకు ఎంత నమ్మకం అంటే పురంధరేశ్వరి గారూ…2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తే అక్కడి ప్రజలు 36 శాతం ఓట్లతో బొటాబొటిగా మిమ్మల్ని గెలిపిస్తే…కేంద్ర మంత్రి అయ్యి తమరు చేసింది ఏంటో తెలుసా? అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి సర్వనాశనం చేశావేమ్మా..! అంటూ ఎద్దేవా చేశారు. మళ్లీ 2019లో అదే విశాఖ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తే మీకు వచ్చిన ఓట్లు కేవలం 2.73% అంటే 33,892 ఓట్లు. మొత్తం 12 లక్షల 50 వేల ఓట్లలో 33 వేల ఓట్లంటే కనీసం మన సామాజికవర్గం వాళ్ళు కూడా వేయనట్టే కదా..? అంటూ ఎద్దేవా చేస్తు ప్రశ్నించారు. మీ క్రెడిబిలిటీ ఇదే పున్నమ్మా.. ఒకసారి మీకు గుర్తు చేయమని ఒక విశాఖ మిత్రుడు పంపాడు..అంటూ సెటైర్లు వేశారు.

 

విజయ సాయి రెడ్డి ట్వీట్ పై ఓ యూజర్ స్పందిస్తు..గుర్తు చేయమని చెప్పినోడు 2014లో విజయమ్మను ఓడించిన విషయం గుర్తు చేయలేదా..? అంటూ కామెంట్ చేశారు.

కాగా..పురందేశ్వరిపై మంత్రి రోజా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కూతురు ఉన్నందుకు ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఏడుస్తుంటారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబును మించిన జగత్ కిలాడీ నువ్వు.. సీఎం సీటు కోసం నాడు నువ్వు, చంద్రబాబు పోటీ పడ్డారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Vijayasai Reddy: పాపం.. పెద్దాయనను లాగిపడేశారే: పురంధేశ్వరిపై విజయసాయి ఆరోపణలు

ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మీ సమాధానం ఏంటి అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు  పురందేశ్వరి మాట్టాడుతు..ఆయన చేేసే వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ తీసిపారేశారు. మద్యం తాగి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని దీనిపై ప్రశ్నించాల్సిన బాధ్యతతోనే తాను ఉన్నానని..దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు.