Minister RK Roja : ఇలాంటి కూతురు ఉన్నందుకు ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఏడుస్తుంటారు- పురంధేశ్వరిపై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు
Roja Fires on Purandeswari: వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబును మించిన జగత్ కిలాడీ నువ్వు. సీఎం సీటు కోసం నాడు నువ్వు, చంద్రబాబు పోటీ పడ్డారు.

Roja On Daggubati Purandeswari (Photo : Google)
ఏపీలో బీజేపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి టార్గెట్ గా వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. ఆమెను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీలో మద్యం విక్రయాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని.. దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని పురంధేశ్వరి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇసుక విక్రయాల్లో జగన్ ప్రభుత్వం భారీగా దోపిడీకి పాల్పడుతోందన్నారు. పురంధేశ్వరి చేసిన ఈ ఆరోపణలపై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. పురంధేశ్వరి టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా.. పురంధేశ్వరిపై నిప్పులు చెరిగారు. కక్ష సాధింపుతోనే పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు అని రోజా ఆరోపించారు. నీ పని నువ్వు చేసుకో అంటూ సీరియస్ అయ్యారు.
Also Read : పాపం.. పెద్దాయనను లాగిపడేశారే: పురంధేశ్వరిపై విజయసాయి ఆరోపణలు
నీకంటూ ఓ నియోజకవర్గం లేదు, ఓట్లూ లేవు..
”రెయిన్ గన్ ల పేరిట రైతులను నాడు చంద్రబాబు మోసం చేశారు. నేడు జగన్ రైతు కుటుంబాలను ఆదుకుంటున్నారు. రైతు ద్రోహి చంద్రబాబు. నా కేసులు త్వరగా తేల్చండి అని స్వయంగా జగన్ పిటిషన్ వేసుకున్నారు. కోర్టు స్టేలతో ఉన్న చంద్రబాబు సంగతి తేల్చమని సీబీఐకి పురంధేశ్వరి లేఖ రాయాలి. నీకంటూ ఓ నియోజకవర్గం లేదు. నీకు ఓట్లు వేసే వారూ లేరు. ఎన్టీఆర్ కూతురు అని ఓ ట్రంప్ కార్డు వాడుకొని పార్టీలు మారి పదవులు పొందావు. ఎన్టీఆర్ కు నువ్వు కనీసం అన్నం కూడా పెట్టలేదు. నీళ్లు ఇవ్వలేదు. కూతురిగా ఆయనకు సేవ చేయలేదు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబును మించిన జగత్ కిలాడీ నువ్వు.
Also Read : అభివృద్ధికి తిలోదకాలు,కక్షపూరిత రాజకీయాలు .. ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదు : పురందేశ్వరి
ఏ తండ్రికీ ఇలాంటి నీతిమాలిన కూతురు పుట్టకూడదు..
సీఎం సీటు కోసం నాడు నువ్వు, చంద్రబాబు పోటీ పడ్డారు. బావ కళ్ళల్లో ఆనందం కోసం ఆయన ఇస్తున్న స్క్రిప్ట్ చదువుతున్నావు. ఇలాంటి కూతురు ఉన్నందుకు ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఏడుస్తుంటారు. మీకు పదవులే ముఖ్యం. ఏ తండ్రికి కూడా ఇలాంటి నీతిమాలిన కూతురు పుట్టకూడదు. స్కీమ్ లను స్కాంలుగా చంద్రబాబు వాడుకున్నారు. రెయిన్ గన్ లతో కరవు జయించానని చెప్పుకున్నారు. సంక్షోభంలో కూడా అవకాశాలను సృష్టించుకుని దోచుకున్నారు. రెయిన్ గన్ ల విషయంలోనూ ఆయనపై కేసులు నమోదవుతాయి” అని మంత్రి రోజా అన్నారు.