YCP MLA రోజా గన్ మెన్ కు కరోనా పాజిటివ్

  • Published By: nagamani ,Published On : July 10, 2020 / 03:21 PM IST
YCP MLA రోజా గన్ మెన్ కు కరోనా పాజిటివ్

Updated On : July 10, 2020 / 5:15 PM IST

ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్,వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కు కరోనా వైరస్ సోకింది. ఈ వార్తతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో అతన్ని ఐసోలేషన్ కు తరలించారు. కాగా..పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రోజాతో కలిసి ట్రావెల్ చేశారు.ఈక్రమంలో అతనికి కరోనా సోకడంతో రోజా తన ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. గన్ మెన్ కు కాంటాక్ట్ లో ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. రోజా కూడా కరోనా పరీక్షలను చేయించుకోలని సూచిస్తున్నారు.

ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేలను దాటి 814కు చేరుకుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కూడా కరోనా బారినపడ్డారు. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 12,154 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.దీనితో ప్రస్తుతం ఏపీలో 11,383 కరోనా యాక్టివ్ కేసులుండగా,277 మంది ఈ మహమ్మారికి బలైపోయారు.

Read Here>>పెన్నానదిలో జేసీబీతో కరోనా మృతదేహాలు ఖననంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్