AP Municipal Election Results 2021 : వైసీపీ ఖాతాలో చేరిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు

Jagan Ycp
YCP : ఎన్నిక ఏదైనా.. ప్రాంతం ఎక్కడైనా.. ఫలితం మాదే అన్నట్లుగా ఉంది వైసీపీ పరిస్థితి. అధికార పార్టీ దూకుడు ముందు ప్రతిపక్షాలు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోతున్నాయి. కొన్ని చోట్లకు మాత్రమే టీడీపీ పరిమితం అవ్వగా.. నాలుగైదు సీట్లకు జనసేన -బీజేపీ కూటమి పరిమితం అవుతోంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, కమ్యూనిస్టులు సింగిల్ డిజిట్ స్ధానాలు కైవసం చేసుకుంటున్నాయి. ఏపీలో ఈ నెల 10న జరిగిన మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.. 2021, మార్చి 14వ తేదీ ఆదివారం ఉదయం
లెక్కింపు ప్రారంభం కాగా తాజా ఫలితాలు వెలువడే సరికి… వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. రాష్టవ్యాప్తంగా పలు కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ వైసీపీ ఇప్పటికే మెజారిటీ స్ధానాలు కైవసం చేసుకుంది.
మున్సిపాల్టీలు : –
ఇచ్చాపురం, చీరాల, రేపల్లె, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, సాలూరు, నర్సీపట్నం, తెనాలి, పులివెందుల, రాయచోటి, పలమనేరు, పుంగనూరు, ఆత్మకూరు (కర్నూలు), డోన్, మడకశిర, నాయుడుపేట, సూళ్లూరు పేట, ఆత్మకూరు (నెల్లూరు), గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి, సత్తెనపల్లి, వినుకొండ, కొవ్వూరు, పలాస, యలమంచిలి, అద్దంకి, తుని, మదనపల్లె, రామచంద్రపురం, వెంకటగిరి, ఎర్రగుంట్ల, పుట్టపర్తి, రాయదుర్గం, పాలకొండ, కళ్యాణ దుర్గం, జంగారెడ్డి గూడెం, గొల్లప్రోలు, ముమ్మిడివరం,
కార్పొరేషన్లు :
కర్నూలు, అనంతపురం, కడప, విశాఖపట్టణం -, విజయవాడ -, గుంటూరు, తిరుపతి, చిత్తూరు, ఒంగోలు, మచిలీపట్నం -, విజయనగరం -, ఏలూరు.