వ్యాక్సిన్ వచ్చే వరకు కోవిడ్ తో జీవించాల్సిందే : సీఎం జగన్

  • Published By: madhu ,Published On : July 16, 2020 / 01:03 PM IST
వ్యాక్సిన్ వచ్చే వరకు కోవిడ్ తో జీవించాల్సిందే : సీఎం జగన్

Updated On : July 16, 2020 / 5:27 PM IST

వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ మనం కోవిడ్‌తో కలిసి జీవించాల్సిందే, ఈ వైరస్ నివారణా చర్యలపట్ల కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు ఏపీ సీఎం జగన్.

వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే : – 
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకాన్ని 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) ఏపీ ప్రభుత్వం విస్తరించింది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ 2020, July 16వ తేదీ గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

ప్రజలకు అవగాహన కల్పించాలి : – 
కోవిడ్‌ వచ్చిందన్న అనుమానం రాగానే ఏం చేయాలన్న దానిపై అవగాహన ఉండాలని, ఎవరికి ఫోన్‌ చేయాలి ? ఏం చేయాలన్నదానిపై, కోవిడ్‌ పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయన్నదానిపై ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. 85 శాతం మంది ఇంట్లోనే ఉండి మందులను తీసుకుంటే తగ్గిపోతుందని, ఇళ్లలో ప్రత్యేక గది లేకపోతే కోవిడ్‌ కేర్‌ సెంటర్లో ఉండొచ్చన్నారు.

కేసులు పెరుగుతాయి : – 
అన్ని రకాలుగా వారిని బాగా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. వైద్యులు అక్కడే ఉండడం, కలెక్టర్లు దీనిమీద దృష్టి పెట్టారన్నారు. ప్రతి రాష్ట్ర సరిహద్దులను తెరిచారు కాబట్టి రాకపోకలు పెరుగడం, ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌కూడా తిరుగుతుండడంతో కేసులు పెరుగుతాయన్నారు.

వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే : – 
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గ్రహించి..ప్రజలకు ఎలా అవగాహన కలిగించగలం ? వారిలో అవేర్‌నెస్‌ కలిగించామా ? లేదా ? అన్న దానిపై దృష్టిపెట్టాలని సూచించారు. కోవిడ్‌ రాగానే ఏం చేయాలన్నదానిపై ప్రతి మనిషికీ అవగాణ ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ విషయంలో కలెక్టర్లు స్పెషల్‌డ్రైవ్స్‌ తీసుకోవాలన్నారు.

ప్రజలు జాగ్రత్తలు పాటించాలి : –  బయటకు పోయినప్పుడు మాస్క్‌ లాంటి పెట్టుకోవడం వల్ల వ్యాప్తి తగ్గుతుందని చెప్పారు. సబ్బుతో చేతులు కడగడం, భౌతిక దూరం పాటించడం లాంటి విషయాలు పాటించాలని ప్రజలకు సూచించారు సీఎం జగన్.