Murder : సొంత బాబాయిని హత్య చేసింది ఆస్తి కోసమే
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో సొంత బాబాయిని హత్య చేశాడో ఓ యువకుడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Murder (1)
young man killed Uncle : ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల విషయంలో సొంత బాబాయిని హత్య చేశాడో ఓ యువకుడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం కనిగిరి మండలం యడవల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, వెంకట నారాయణ అన్నదమ్ములు. వెంకట నారాయణ కుటుంబంతో వెంకటేశ్వరరావుకు ఆస్తి వివాదాలు ఉన్నాయి. అయితే ఆస్తి సమస్యను పరిష్కరించాలంటూ వెంకటేశ్వరరావు వారం క్రితం కనిగిరిలో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు ధరఖాస్తు ఇచ్చారు. ఈ మేరకు అధికారులు వెళ్లి విచారణ చేశారు.
దీంతో కోపం పెంచుకున్న వెంకట నారాయణ కుమారుడు పుల్లారావు మద్యం తాగుదామంటూ వెంకటేశ్వరరావును బుధవారం కొనకనమిట్ల మండలంలోని పెదారికట్ల ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గరకు తీసుకెళ్లాడు. ఇద్దరూ మద్యం తాగారు. పుల్లారావు..వెంకట నారాయణతో గొడవ పెట్టుకొని సీసా పగులగొట్టి అతని గొంతులో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వెంకట నారాయణ మృతి చెందాడు.
పథకం ప్రకారమే హత్య చేసినట్లు అక్కడున్న జనంతో నిర్భయంగా చెప్పాడు. ‘నేనేం పారిపోలా… మర్డర్ చేసి ఇక్కడే ఉన్నా… అవును.. ఆస్తి గొడవల వల్లే చంపేశా… ఇప్పుడేంటి…’ అని మృతదేహం వద్ద ఉండి యువకుడు మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.