సోలార్ పవర్‌ స్కామ్ కేసులో జగన్‌ టార్గెట్ అయ్యారా? ఏపీలో దర్యాప్తు సాధ్యమేనా?

ఇదంతా రాజకీయ, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న ఇష్యూ అంటున్నారు.

సోలార్ పవర్‌ స్కామ్ కేసులో జగన్‌ టార్గెట్ అయ్యారా? ఏపీలో దర్యాప్తు సాధ్యమేనా?

YS JaganMohan Reddy

Updated On : November 26, 2024 / 5:37 PM IST

అమెరికాలో కేసు.. దేశాన్ని ఊపేస్తున్న వ్యవహారం.. అపోజిషన్‌ నేతను టార్గెట్‌ చేస్తున్న తీరుతో.. సోలార్‌ పవర్ కొనుగోళ్ల కేసు ఓవర్‌ టు ఏపీ అయిపోయింది. దేశం మొత్తం అదానీ సెంట్రిక్‌గా చర్చ జరుగుతుంటే ఏపీలో మాత్రం జగన్‌ను కార్నర్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్‌ను ప్రాసిక్యూట్‌ చేసే అవకాశాలను పరిశీలిస్తోందట రాష్ట్ర ప్రభుత్వం. విద్యుత్‌ కొనుగోలు అగ్రిమెంట్‌ వ్యవహారంలో అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ కమిషన్‌ గౌతమ్‌ అదానీతో పాటు ఆయన సన్నిహితులపై కేసు పెట్టింది.

2021లో ఏపీ ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్‌ను కొనడానికి రూ.1750 కోట్ల లంచం ఇచ్చారని..ఈ వ్యవహారంలో అప్పటి ఏపీ సీఎం ఉన్నారని ప్రస్తావించారు. దీని ఆధారంగా జగన్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టొచ్చా అన్న కోణంలో కూటమి ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరినట్లు తెలుస్తోంది. జగన్‌ను ప్రాసిక్యూట్‌ చేయడానికి గవర్నర్‌ అనుమతి కోరాలని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తోందట.

ముందడుగు వేయడం సాధ్యమేనా?
జగన్‌ మీద యాక్షన్‌ తీసుకోవడానికి ఏపీ సర్కార్‌కు లీగల్‌గా ఎంతవరకు అవకాశం ఉందనేది ఇక్కడ హాట్ టాపిక్‌గా మారింది. అమెరికాలో నమోదైన కేసుల వ్యవహారం.. ఇష్యూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్‌ మీద చర్యలకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేయడం సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది.

సెకీతో పవర్‌ అగ్రిమెంట్లు చేసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. సెకీ కేంద్రప్రభుత్వ సంస్థ. ఒకవేళ ఏపీలో జగన్‌ మీద కేసు పెడితే సెకీ కూడా కార్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు అదానీ వరకు వ్యవహారం వెళ్లే చాన్స్ లేకపోలేదు. అలా జరిగితే కేంద్రప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్‌లో ఏపీ సర్కార్‌ వేసే అడుగులు కీలకంగా మారనున్నాయి.

జగన్‌ను కార్నర్ చేయబోతే..సెకి, అదానీని కేసులో ఇన్వాల్వ్‌ చేయాల్సి ఉంటుందని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఎన్డీయేలో కీలకంగా ఉన్న టీడీపీ అంతదూరం వెళ్తుందా అనేదే ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే ప్రస్తుతం కూటమి నేతల విమర్శలు చూస్తుంటే మాత్రం జగన్‌ అడ్డగోలుగా దోచుకున్నారని ఎక్స్‌పోజ్‌ చేయాలని పిక్స్ అయినట్లు కనిపిస్తోంది. దానికి ఆధారంగా యూఎస్‌లో నమోదైన కేసును ఎంగ్జామ్‌ పుల్‌గా చూపిస్తోంది.

అంతేకాదు జగన్, అదానీ మూడుసార్లు భేటీ అయ్యారని..ఆ మీటింగ్‌ వివరాలు ఎందుకు రహస్యంగా ఉంచారని ప్రశ్నిస్తోంది టీడీపీ. పవర్‌ పర్చేస్‌కు సంబంధించిన ఫైల్‌కు కేవలం ఏడు గంటల్లోనే ఆమోదం తెలిపారని ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి రూ.1.10 లక్షల కోట్ల విలువ చేసే విద్యుత్‌ కొనుగోళ్ల ఫైల్‌ను ఆర్థికశాఖ ఆఘమేఘాల మీద ఆమోదించిందని అలిగేషన్స్ చేస్తున్నారు కూటమి నేతలు. దీనివెనుక ప్రభుత్వ పెద్దలు ఎంతగా ఒత్తిడి చేయకుంటే ఫైల్‌ అంత తొందరగా కదులుతుందో చెప్పాలంటూ క్వశ్చన్ చేస్తున్నారు.

బాలినేని శ్రీనివాస్ హాట్ కామెంట్స్‌
అయితే కూటమి నేతల ఆరోపణలకు బలం చేకూర్చేలా మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశం అవుతున్నాయి. పవర్ కొనుగోళ్ల ఫైల్ మీద సంతకం కోసం తనను అర్ధరాత్రి నిద్రలేపారని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. మిడ్‌ నైట్‌ సంతకం పెట్టుమంటున్నారంటే ఏదో ఉందని గ్రహించే తాను సైన్ చేయలేదని తర్వాత క్యాబినెట్‌లో పెట్టి ఆమోదం తెలిపారని బాలినేని అంటున్నారు. అలా అగ్రరాజ్యంలో కేసు..బాలినేని వ్యాఖ్యలతో కూటమి నేతలు వైసీపీని, జగన్‌ను కార్నర్‌ చేస్తున్నారు.

అయితే పవర్ పర్చేస్‌ అగ్రిమెంట్‌ మీద ఏపీ సర్కార్ దర్యాప్తు చేయడం, పొలిటికల్‌గా..లీగల్‌పరంగా అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ ఎన్డీయేలో భాగంగా ఉండటంతో విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంలో కూటమి దూకుడుగా వెళ్లే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. లీగల్‌గా కూడా అమెరికాలో కేసు ఉండటం..కేంద్రప్రభుత్వమే అదానీ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎలాంటి స్టెప్‌ వేయకపోవడంతో..ఏపీ సర్కార్ చేసేదేం ఉండదని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌.

ఇదంతా రాజకీయ, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న ఇష్యూ అంటున్నారు. సో జగన్‌ కరప్షన్‌కు పాల్పడ్డారని ఎక్స్‌పోజ్‌ చేయడం తప్ప ఏపీ సర్కార్ యాక్షన్‌ తీసుకోవడానికి అవకాశాలు తక్కువే ఉన్నాయంటున్నారు. కూటమి నేతలు మాత్రం పవర్ పర్చేస్ అగ్రిమెంట్‌ ఫైల్‌ ఆమోదం ప్రాసెస్‌ తీరును హైలెట్‌ చేస్తున్నారు. అంత తొందరగా గంటల వ్యవధిలో ఆమోదం తెలిపారంటేనే ఏదో ఇలఖత మాఫియా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇలా ఓవరాల్‌ ఎపిసోడ్‌ చూస్తుంటే ఈ ఐదేళ్లు ఈ టాపిక్ పొలిటికల్‌గా డైలీ ఎపిసోడ్‌లాగే కొనసాగే అవకాశమే కనిపిస్తోంది.

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!