YS Jagan : జాగ్రత్త చంద్రబాబు.. ఏపీలో కూడా కాక్రోచ్లు బయటకు వస్తాయి.. జగన్ సంచలన కామెంట్స్..
YS Jagan : తమ వాళ్లకు ఉద్యోగాలు వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకొచ్చారు. వాళ్లకు ఉద్యోగం ఇచ్చిన.. జీవో 23, 25, 26తో గేట్లు మూసేశారు. అసలు మీరిచ్చిన జీవో నెంబర్ 4, 47 ఎందుకు రద్దు చేశారు? ఇది స్కామ్ కాకపోతే ఇంకేంటి అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ys jagan
YS Jagan : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read : Bill Gates : జెఫ్రీ ఎప్స్టీన్ హామీలు నమ్మి మోసపోయా.. అతని పరిచయం వెనుక అసలు కథ చెప్పిన బిల్ గేట్స్..
తమ వాళ్లకు ఉద్యోగాలు వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకొచ్చారు. వాళ్లకు ఉద్యోగం ఇచ్చిన.. జీవో 23, 25, 26తో గేట్లు మూసేశారు. అసలు మీరిచ్చిన జీవో నెంబర్ 4, 47 ఎందుకు రద్దు చేశారు? ఇది స్కామ్ కాకపోతే ఇంకేంటి అంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంతా లీకుల మయమేనని.. ఇప్పుడు డీఎస్సీ విషయంలోనూ అదే జరిగిందని జగన్ అన్నారు.
చంద్రబాబు హయాంలో అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయమన్న జగన్.. 1995లో టెన్త్ క్లాస్ పేపర్ల లీక్. 1996లో ఎంసెట్ ఇంజినీరింగ్ పేపర్స్ లీక్. 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్. 2017లో టెన్త్ సైన్స్ పేపర్ లీక్. 2019లో టెన్త్ పేపర్ లీక్. 2025లో బీఈడీ పేపర్ లీక్. 2025లో మ్యాథ్స్ పేపర్ లీక్. ఇప్పుడు డీఎస్సీ టీచర్ల రిక్రూట్మెంట్ లీక్.. లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇది అంటూ జగన్ విమర్శలు గుప్పించారు.
మెగా డీఎస్సీలో తప్పులను అవకతవకలను ఎత్తిచూపితే చంద్రబాబుకు బీపీ వస్తోందన్న జగన్.. ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఇది జెన్జీ కాలం. ఇప్పుడు జెన్ ఆల్ఫా కూడా నడుస్తోంది. చంద్రబాబూ.. దగాపడ్డ యువత నిన్ను విడిచిపెట్టదు. ఏపీలో కూడా కాక్రోచ్ లు బయటకు వస్తాయి.. తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు అంటూ జగన్ హెచ్చరించారు.
