కౌంటింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో వైసీపీ అలెర్ట్
చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలని అనుకుంటున్నారని సజ్జల చెప్పారు.

Sajjala Ramakrishna Reddy
ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ అలెర్ట్ అయింది. కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన విధానాలపై వరుసు సమావేశాలు నిర్వహిస్తోంది. ఇవాళ వర్చువల్ గా సమావేశం ఏర్పాటు చేసి కౌంటింగ్ ఏజెంట్‌లకి, పార్టీ నేతలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు.
కౌంటింగ్ రోజు అనుసరించాలిసిన అంశాలపై 175 నియోజకవర్గల కౌంటింగ్ ఏజెంట్ లకు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి పోలింగ్, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఈసీ, ఎన్డీఏ విధానాలను వైసీపీ తప్పుబడుతోంది.
ఇవాళ సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారని చెప్పారు. ఈసీ, ఎన్డీఏ ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నదన్న విషయాలు అందరికీ తెలుసని తెలిపారు. ప్రజా తీర్పు వైసీపీకి అనుకూలంగా ఉందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారని, జాగ్రత్తగా చూడాలని అన్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు
వైసీపీకి పడిన ప్రతి ఒక్క ఓటు వైసీపీకే చెందాలని వ్యాఖ్యానించారు. చల్లని ఓటు చెల్లదు అని గట్టిగా చెప్పాలని అన్నారు. అవతల పార్టీలు నిబంధనలను అతిక్రమిస్తే గట్టిగా నిలదీయాలని అన్నారు. కచ్చితంగా నియమాలను ఫాలో అవ్వాలని తెలిపారు. అన్ని అంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని కౌంటింగ్ ఏజెంట్ లకు సూచించారు.
Also Read: చార్మినార్ వద్ద కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతల ఆందోళన