YS Jagan: ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జగన్.. వీడియో

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులకు చేరుకున్నారు.

YS Jagan: ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జగన్.. వీడియో

YS Jagan

Updated On : October 29, 2024 / 2:10 PM IST

YS Jagan Pulivendula Tour: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులకు చేరుకున్నారు. ఉదయం ఇడుపులపాయ వెళ్లిన జగన్.. అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ జగన్ వెంట కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ సీపీకి చెందిన నేతలు పాల్గొన్నారు.

Also Read: Pawan Kalyan – Nagababu : పిఠాపురంలో అన్ని తానై పనిచేశారు.. నాగబాబుకు పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెష్..

మంగళవారం ఉదయమే బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్.. మూడు రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పులివెందుల ప్రజలతో పాటు పార్టీ నాయకులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు.