Kiran Royal : ఎలాంటి కేసులైనా పెట్టుకోండి, భయపడను, నా వెనుక పవన్ కల్యాణ్ ఉన్నారు- కిరణ్ రాయల్

భర్త లేని ఓ మహిళతో నాపై కేసులు పెట్టించబోతున్నారు. భూకబ్జా వ్యవహారంలో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెడతారన్న విషయాన్ని ఒక వైసీపీ యువ నేత జన సైనికులకు చెబుతున్నాడు. Kiran Royal

Kiran Royal : ఎలాంటి కేసులైనా పెట్టుకోండి, భయపడను, నా వెనుక పవన్ కల్యాణ్ ఉన్నారు- కిరణ్ రాయల్

Kiran Royal Allegations (Photo : Google)

Updated On : November 6, 2023 / 8:42 PM IST

Kiran Royal Allegations : జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు నన్ను టార్గెట్ చేయడం మొదలెట్టారు అని ఆయన అన్నారు. ఇప్పటివరకు నా కులంపై విమర్శలు చేశారు, ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని చెప్పారు. మంత్రి రోజా, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డిలు నన్ను టార్గెట్ చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

”నేను శ్రీవారి టిక్కెట్లను విక్రయిస్తున్నా అని ఇదివరకు నిరాధార ఆరోపణలు చేశారు. నా కులం గురించి ప్రశ్నించారు. ఇప్పుడు ఓ మహిళను అడ్డుపెట్టుకొని నాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు. నన్ను జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో నాపై అక్రమ కేసులు పెట్టేందుకు సిద్థమవుతున్నారు.

Also Read : బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఖరారు.. పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేయబోయే 8 స్థానాలు ఇవే

భర్త లేని ఓ మహిళతో నాపై కేసులు పెట్టించబోతున్నారు. భూకబ్జా వ్యవహారంలో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెడతారన్న విషయాన్ని ఒక వైసీపీ యువ నేత జన సైనికులకు చెబుతున్నాడు. అతడి ఆడియో నా దగ్గర ఉంది. ఆడియోను తిరుపతి ఎస్పీకి చూపించి ఫిర్యాదు చేశాను. ఎస్పీ స్పందించకుంటే ఆధారాలతో కోర్టుకు వెళతాను. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించి జైలుకు పంపుతారా..? నేను భయపడను. నాపై ఎలాంటి కేసులైనా పెట్టుకోండి. నా వెనుక పవన్ కల్యాణ్ ఉన్నారు” అని కిరణ్ రాయల్ అన్నారు.

Also Read : ముందు మీ కథ మీరు చూసుకోండి- సజ్జలకు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్