Vijay Sai Reddy : కేవీ రావు ఎవరో నాకు తెలియదని ఈడీ అధికారులతో చెప్పా- ఎంపీ విజయసాయిరెడ్డి

శరత్ చంద్రా రెడ్డితో ఉన్న సంబంధాల గురించి కూడా నన్ను ఈడీ అధికారులు అడిగారు.

Vijay Sai Reddy : కేవీ రావు ఎవరో నాకు తెలియదని ఈడీ అధికారులతో చెప్పా- ఎంపీ విజయసాయిరెడ్డి

Updated On : January 6, 2025 / 9:00 PM IST

Vijay Sai Reddy : కాకినాడ C పోర్ట్ విషయంలో ఈడీ తనను విచారించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసింది. కేవీ రావు నాకు తెలియదని ఈడీ అధికారులతో చెప్పానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆయనకు, నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు విజయసాయిరెడ్డి.

”కాకినాడ C పోర్ట్ విషయంలో కేవీ రావుకు నేను ఫోన్ చెయ్యలేదు. కేవీ రావును తిరుమలకు రమ్మని చెప్పమని చెప్పండని చెప్పా. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. 2020 మే నెలలో నేను ఫోన్ చేశానని కేవీ రావు చెబుతున్నారు. కాల్ డేటా తీసి చూడండి. నేను కేవీ రావుకి ఫోన్ చెయ్యలేదు. కేవీ రావును ఈడీ విచారణకు పిలవండని కోరాను.

రంగనాధ్ కంపెనీకి ప్రభుత్వానికి ఎవరు పరిచయం చేశారని ఈడీ ప్రశ్నించింది. నాకు సంబంధం లేదని చెప్పాను. నేను ఒక సాధారణమైన ఎంపీని మాత్రమే. శ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవరు అపాయింట్ చేశారో నాకు తెలియని చెప్పా.

శరత్ చంద్రా రెడ్డితో ఉన్న సంబంధాల గురించి కూడా నన్ను ఈడీ అధికారులు అడిగారు. ఫ్యామిలీ రిలేషన్ అని చెప్పా. కాకినాడ C పోర్ట్ విషయంలో నాకు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. లుకౌట్ నోటీసులఫై నేను ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాను. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీకి చెప్పాను.

విక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారు. విక్రాంత్ రెడ్డితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపలేదు. 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాను” అని ఈడీ విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

 

Also Read : విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి..! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు..!