గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి నుంచి ఏపీ వ్యాప్తంగా వైసీపీ..

గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి ఇవాళ అమరావతిలోని రాజ్ భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. తాడేపల్లిలో తమ పార్టీ ఆఫీసు కూల్చివేతతో పాటు రాష్ట్రంలో ఇతర కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం, తమ నేతలపై కేసులు పెట్టడం వంటి వాటిపై ఫిర్యాదు చేశారు. కార్యకర్తలపై దాడుల గురించి వివరించారు.

ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి నుంచి ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని తెలిపారు. వైఎస్ ఫోటో ఉన్న శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని చెప్పారు.

తాము గతంలోనూ గవర్నర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. వైసీపీకి ఓట్లు వేసిన వారిపై కూడా దాడులు చేస్తున్నారని తెలిపారు. తమ పార్టీ అఫీసుల్లోకి అక్రమంగా చొరబడి బిల్డింగ్స్ కూల్చివేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.

వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామని తెలిపారు. వైసీపీ కార్యాలయాలకు నిబంధనల ప్రకారమే స్థలాల కేటాయింపు జరిగిందని చెప్పారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు.

హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలంటూ రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు