CM Jagan : చంద్రబాబుకి చివరి ఎన్నికలు కావాలి, ఆయనకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి- సీఎం జగన్

ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్తు నిర్ణయం అవుతుంది అనేది ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోండి.

CM Jagan : చంద్రబాబుకి చివరి ఎన్నికలు కావాలి, ఆయనకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి- సీఎం జగన్

Cm Jagan Slams Chandrababu Naidu

CM Jagan : ఈ ఎన్నికలు చంద్రబాబు పార్టీకి చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబుకి ఓటు వేస్తే పదేళ్లు వెనక్కిపోతాం అని హెచ్చరించారు. నంద్యాలలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.

”నారావారి పాలన రాకుండా చేసేందుకు మీరంతా సిద్ధమా? చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి. నరకాసురుడు, రావణుడు, దుర్యోదనుడు కలిశారు. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతాం. గతంలో చంద్రబాబు అబద్దాలు, మోసాలు చూశాం. ఓటు వేయని వారిని కూడా అడుగుతున్నా. మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచన చేయమని కోరుతున్నా. ఓటు వేసే ముందు ఆలోచన చేయండి.

రైతులు, వృద్ధులు, సామాజికవర్గాల వారీగా ఆలోచన చేయండి. అంధులు కూడా ఆలోచన చేయండి. ఇంటికి వెళ్లి మీ ఇల్లాలు, మీ పిల్లలు, మీ అవ్వా తాతలతో ఆలోచన చేయండి. ఎవరి వల్ల, ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది? మంచి చేసే మనసు ఏ పాలకుడికి ఉంది? అనేది ఆలోచన చేయండి. ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా.

ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్తు నిర్ణయం అవుతుంది అనేది ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర అయితే.. మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి” అని జగన్ పిలుపునిచ్చారు.

Also Read : టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! ఆ రెండు సీట్లకు అభ్యర్థుల ప్రకటన