ఎన్ని జెండాలు కలిసి వచ్చినా ధర్మవరంలో ఎగిరేది వైసీపీ జెండానే- ఎమ్మెల్యే కేతిరెడ్డి
నరేంద్ర మోడీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పిన పవన్ కళ్యాణ్ నేడు మోడీతోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు.

MLA KethiReddy Venkatarami Reddy
MLA KethiReddy Venkatarami Reddy : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వన్స్ మోర్ కేతిరెడ్డి కార్యక్రమంలో కూటమిపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఎన్ని జెండాలు కలిసి వచ్చినా ధర్మవరంలో ఎగిరేది వైసీపీ జెండానే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నాకు వచ్చే మెజార్టీని చూసి ధర్మవరం చుట్టుపక్కల కనిపించాలంటే మీరు భయపడేలా చేస్తాను అని వ్యాఖ్యానించారు. నరుకుతాం తొక్కుతాం అంటే కాదు జనాన్ని కలుపుకొని వెళ్లిన వాడే నాయకుడు అవుతాడు అని అన్నారు. మా నాన్న పేరు చెబుతాం మా తాతల పేరు చెబుతామంటే ఓట్లు పడే కాలాలు పోయాయని చెప్పారు.
”ధర్మవరం చరిత్ర ఉన్నంత కాలం ఇక్కడ ఒక ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉండే వాడు. ధర్మవరం దశ దిశ మార్చాడు. అనిపించుకోవాలన్నదే నా కోరిక. ధర్మవరంలో ఓడిపోయిన 20 రోజులకే వరదాపురం సూరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాప్తాడులో ఓడిపోయిన తర్వాత శ్రీరామ్ ఇక్కడికి వచ్చారు. కొద్దిరోజుల తర్వాత జనసేన తరఫున ఇంకొకాయన వచ్చారు. ఇప్పుడు బీజేపీ తరఫున ఇంకో ఆయన వచ్చారు. వీళ్ళందరికీ ఒకటే బాధ. నేను గుడ్ మార్నింగ్ నిర్వహిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్లందరి ఉద్దేశ్యం ఒకటే. కేతిరెడ్డిని మాట్లాడితే మేము అందరం హీరోలు అయిపోతాం అనుకుంటున్నారు. కేతిరెడ్డిని మాట్లాడితే హీరోలు కాలేరు. కేతిరెడ్డిలా జనాల వద్దకు వెళ్తే హీరోలు అవుతారు.
చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఏం ఉపయోగం? గతంలో నరేంద్ర మోడీని విమర్శించిన వ్యక్తి నేడు నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నరేంద్ర మోడీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని అని చెప్పిన పవన్ కళ్యాణ్ నేడు మోడీతోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో నారా లోకేష్ కంటే ముందే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఏడ్చారు. ఇలాంటి వ్యక్తులను ఏమనుకోవాలి? అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు.
Also Read : రెండు పార్టీల్లోనూ డేంజర్ బెల్స్..! హాట్‌హాట్‌గా శృంగవరపు కోట పాలిటిక్స్