Ugadi: ఈ ఏడాది ఈ సెలబ్రిటీలు జైలుకు వెళ్లే ప్రమాదం: వేణుస్వామి

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన భారతదేశాన్ని కలవరపర్చే అతిపెద్ద సంచలనాత్మక సంఘటన జరిగే అవకాశం ఉందని అన్నారు.

Ugadi: ఈ ఏడాది ఈ సెలబ్రిటీలు జైలుకు వెళ్లే ప్రమాదం: వేణుస్వామి

Venu Swamy

Updated On : March 30, 2025 / 11:05 AM IST

ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కొందరు సెలబ్రిటీలు జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తెలిపారు.
విశ్వావసు నామ సంవత్సరంలో ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయనే విషయంపై 10టీవీతో ఆయన మాట్లాడారు.

“సెలబ్రిటీలు అంటే ఒక్క సినిమా ఇండస్ట్రీ నుంచి కాదు.. వ్యాపారం, సినిమా, సోషల్ మీడియా అన్ని రంగాల్లోని వీవీఐపీలకు సమస్యలు ఎదురవుతాయి. సెలబ్రిటీలకు కచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది. సమాజంలో చెడ్డపేరు, న్యాయపర ఇబ్బందులు, జైలుకు వెళ్లే ప్రమాదం రావచ్చు.

Also Read: రాజకీయాల్లో పెను సంచలనం.. ఈ ఏడాది వీరు పదవి నుంచి దిగిపోయే అవకాశం: వేణుస్వామి

తెలుగు చిత్ర పరిశ్రమ మీనరాశికి సంబంధించి. తెలుగు రాజకీయాలు అనేవి తుల రాశికి సంబంధించింది. తుల రాశిని తీసుకుంటే ఆరవ స్థానమైన మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. మీన రాశిని తీసుకుంటే మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది.

కాబట్టి, మేష, తుల, మీన, సింహ, ధనుస్సు రాశులకు సంబంధించిన ముఖ్యులు, సెలబ్రిటీల్లో సంచనాలు జరుగుతుంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన భారతదేశాన్ని కలవరపర్చే అతిపెద్ద సంచలనాత్మక సంఘటన జరిగే అవకాశం ఉంది.

మీడియా రంగంలోనూ అతి పెద్ద సంచనాలు జరుగుతాయి. రాజకీయ నాయకులు ఏ పార్టీ మారకుండా ఒకే పార్టీలో ఉంటే మంచిది. వారు ఏడాది పాటు వేచి చూడాలి” అని వేణుస్వామి అన్నారు.