Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారు నిరుత్సాహంగా ఉంటారు..!

ఈ రోజు (2024 డిసెంబర్ 08, ఆదివారం) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారు నిరుత్సాహంగా ఉంటారు..!

Updated On : December 7, 2024 / 7:27 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోది నామ సంవత్సర మార్గశిర శుక్ల సప్తమి ఉ. 9:44 శతభిషం సా: 4:03 ఆదివారము..

మేషం : ఈ రోజు సామాన్యంగా ఉంటుంది, అన్ని రంగాలవారు ఏ పనిలోనూ పురోగతి లేక పోవడం వల్ల నిరుత్సాహంగా ఉంటారు. కుటుంబ సమస్యల వల్ల మానసిక అశాంతి, కోపాన్ని తగ్గించుకోవాలి, అలసట, బద్ధకం వ్యాపారంలో లాభములు, ఉద్యోగ భద్రత అవసరం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

వృషభం : ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తిపరంగా ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆర్ధిక సమస్యలతో చికాకుతో ఉంటారు. మోసాలకు నష్టాలకు అస్కారము ఉంది. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయుణములు ఫలవంతంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన వలన శుభఫలితములు కలుగుతాయి

మిధునం : ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో పోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుంచి మంచి సహాయ సహకారములు లభిస్తాయి. ఇష్ట దేవతారాధన వలన వలన ఉత్తమ ఫలితములు.

కర్కాటకం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సోదరిలతోను, రక్త సంబంధీకులతో అనుబంధం ధృడపడుతుంది. కుటుంబ సభ్యులతో తీర్థ యాత్రలకు వెళ్లడం విదేశాల నుంచి మంచివార్తలు, సామాజిక కార్యక్రమములలో పాల్గొంటారు. ఆర్థిక సంబంధమైన అంశాలలో అనుకూలత ఉంటుంది. శ్రీ రామనామ జపం వలన శుభం కలుగుతుంది.

సింహం: ఈ రోజు మిశ్రమ ఫలితములు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. వ్యాపారస్థులు సమష్టి నిర్ణయాలు తీసుకుంటారు. సానుకూల ఆలోచనలతో ఆనందంగా ఉంటారు. మీకు ఆత్మ విశ్వాసం పెరగడం మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. వృత్తి పరంగా కీలక చర్చలలో పాల్గొంటారు . మీవాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణము వలన మేలు కలుగుతుంది.

కన్యా: ఈ రోజు ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారులలో సరైన అవకాశములు లేకపోవడం నిరాశతో ఉంటారు. ఆర్థిక సమస్యలతో మానసిక ప్రశాంతత కోల్పోతారు. సంతానం అభివృద్ధి సంతోషం కలిగిస్తుంది, వృధా ఖర్చులు నివారిస్తే మంచిది, శుభకార్యక్రమములలో పాల్గొంటారు – ఈశ్వరుని ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

తులా : ఈ రోజు శుభ ఫలితములు కలుగుతాయి. ప్రయాణమువలన లాభములు కలుగుతాయి, వృత్తి పరంగా ఆశించిన ప్రయోజనములు పొందుతారు. ఖర్చులు పెరగడం, కీలక వ్యవహారములలో నిర్ణయములు తీసుకోవడంలో స్పష్టత లోపిస్తుంది. గిట్టని మాటలు పట్టించుకోవద్దు, ప్రయాణముల వలన లాభములు కలుగుతాయి. విద్యార్థులకు అనుకూలము. శ్రీ దత్తాత్రేయ పారాయణము చేయడం వల్ల శుభం కలుగుతుంది.

వృశ్చికము : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణములు చేయడం, ఆర్థిక పరంగా లాభములు కలగడం, వ్యాపారములలో లాభములు, ఉద్యోగంలో అనుకూల ఫలితములు కలగడం, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము, ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరి కొంతకాలం ఎదురుచూడాలి, కుటుంబంలో ఆనందము కలగడం, విలువైన ఆభరణములు, కొనుగోలు చేస్తారు. శివారాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

ధనస్సు రాశి: ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోండి. అన్నదమ్ములు, అక్కా చెల్లెల్ల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది, భార్య భర్త ల మధ్య అనుబంధం పెరగడం, ఉద్యోగ వ్యాపారములలో లాభములు, నూతన వస్త్రప్రాప్తి, విలువైన ఆభరణములు పెరగడం, నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల ఉత్తమ ఫలితములు వస్తాయి.

మకర రాశి: ఆరోగ్యం కుదుటపడుతుంది, ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది, శుభవార్తలు వింటారు, భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు, మీ భాగస్వామితో అన్ని విషయములు పంచుకుంటారు, నేడు ఏ పని చేసిన విజయం సాధిస్తారు- గణపతిని గకార అష్టోత్తరతో పూజ చేసిన శుభ ఫలితములు కలుగును

కుంభం: వృత్తి వ్యాపారంలో శారీరక శ్రమ అధికం, ఆటంకములతో కూడిన విజయం, కుటుంబ సౌఖ్యం, సుఖసంతోషములు, కోపంతో సమస్యలు, స్థాన చలనము, బంధు మిత్రుల కలయిక, గృహంలో మార్పులు, కుటుంబ వ్యక్తుల సహకారం. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శుభం కలుగును.

మీనం: అకస్మిక ప్రయూణములు, స్థానచలనము, గృహములో మార్పులు, శుభమూలక ధనవ్యయం, శుభకార్య సిద్ధి, కోపంతో వివాదములు పెరుగుట, వస్తు వాహనములు కొనడం, ఆకస్మిక ధనలాభం, స్త్రీ మూలక వివాదములు, రుణ బాధ నివృత్తి. సుందర కాండ పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956