Horoscope Today : ఈరోజు ఈ మూడు రాశులవారికి అద్భుతం.. సెడెన్‌గా డబ్బు వచ్చే యోగం
Horoscope Today : ఈరోజు ఆదివారం (మార్చి 16) నాడు గురువు శక్తిని కూడా పరిగ్రహించి కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఆకస్మిక ధన యోగం కలిగిస్తాడు. మిథునం, తుల, కుంభ రాశుల వారికి సత్ఫలితాలు ప్రసాదిస్తాడు..

Horoscope Today
Horoscope Today : బలమైన గ్రహంగా పరిగణించే రాహువు ఈ రోజు నక్షత్రం మారుతున్నాడు. గురు నక్షత్రమైన పూర్వాభాద్రలోకి అడుగుపెడుతున్నాడు. గురువు శక్తిని కూడా పరిగ్రహించి కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఆకస్మిక ధన యోగం కలిగిస్తాడు. ముఖ్యంగా మిథునం, తుల, కుంభ రాశుల వారికి సత్ఫలితాలు ప్రసాదిస్తాడు..

Aries
మేషం: ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. భూ వ్యవహారాలు ఇబ్బంది కలిగించవచ్చు. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. గణపతి ఆలయాన్ని సందర్శించండి.

Taurus
వృషభం: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యనిర్వహణలో సంయమనం అవసరం. పాతబాకీలు వసూలు అవుతాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. శివారాధన శుభప్రదం.

Gemini
మిథునం: వివాదాలకు దూరంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల ప్రోత్సాహంతో పనులు నెరవేరుతాయి. మంచి అవకాశాలు వస్తాయి. పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. రామాలయాన్ని సందర్శించండి.

Cancer
కర్కాటకం: ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. కొత్త పరిచయాల వల్ల కార్యసిద్ధి ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Leo
సింహం: అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. మథురాష్టకం పఠించండి.

Virgo
కన్య: ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రెట్టింపు శ్రమ అవసరం. వ్యాపార భాగస్వాములతో వివాదాలు తలెత్తవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Libra
తుల: న్యాయ సమస్యలు తీరుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుగురికి సాయపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

Scorpio
వృశ్చికం: విహారయాత్రకు వెళ్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు అధిగమిస్తారు. లలితాదేవి స్తోత్రాలు పఠించండి.

Sagittarisu
ధనుస్సు: పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెద్దల సూచనలు పాటించడం అవసరం. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. శివాలయాన్ని సందర్శించండి.

Capricorn
మకరం: పనిలో బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. న్యాయ సమస్యలు తీరుతాయి. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. భూ వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
కుంభం: ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యపనుల్లో కదలిక వస్తుంది. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. సత్ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఇష్టదైవాన్ని పూజించండి.
మీనం: ప్రయాణాలు కలిసివస్తాయి. బంధుమిత్రుల సహకారంతో కార్యసాఫల్యం ఉంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. బాధ్యతతో మెలగడం అవసరం. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.