Karthika Masam Day 2: అక్టోబర్ 23.. కార్తీక మాసం 2వ రోజు.. ఇలా స్నానం చేసి అలా పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు..!

కార్తీక పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే.. కార్తీక మాసంలో రెండో రోజు ప్రతి ఒక్కరు శివాలయంలో ధ్వజ స్థంభం దగ్గర..

Karthika Masam Day 2: అక్టోబర్ 23.. కార్తీక మాసం 2వ రోజు.. ఇలా స్నానం చేసి అలా పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు..!

Updated On : October 23, 2025 / 12:45 AM IST

Karthika Masam Day 2: అక్టోబర్ 23.. గురువారం.. కార్తీక మాసంలో రెండో రోజు పాటించాల్సిన ముఖ్యమైన విధివిధానాలు ఏంటో తెలుసుకుందాం. కార్తీక పురాణం ప్రకారం.. కార్తీక మాసంలో రెండో రోజు స్నానం చేసే ముందు ఒక ప్రత్యేకమైన విధి విధానం అందరూ తప్పకుండా పాటించాలి. ఎక్కడైనా నదీ తీరంలో ఉన్న మట్టి కొద్దిగా తెచ్చుకుని, ఆ మట్టి శరీరానికి రాసుకుని స్నానం ఆచరించాలి. నదీలో స్నానం చేస్తే అక్కడే నదీ తీరంలో ఉన్న మట్టిని శరీరానికి రాసుకోవాలి. అలా వీలు కాని వాళ్లు, ఇంట్లో స్నానం చేసే వాళ్లు ముందు రోజే వెళ్లి నదీ తీరంలో ఉన్న మట్టి తెచ్చుకుని ఇంట్లో ఏర్పాటు చేసుకుని ఆ మట్టిని శరీరానికి రాసుకుని స్నానం చేయొచ్చు.

లేదా ఆవు గిట్టల కింద ఉన్న మట్టిని తెచ్చుకుని అయినా సరే శరీరానికి రాసుకుని స్నానం చేయొచ్చు. ఆవు గిట్టలు అంటే ఆవు పాదాలు. ఇలా కూడా అందరికీ సాధ్యం కాదు. అటువంటప్పుడు తులసి కోటలోని మట్టిని తీసుకుని దాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేయాలి. కార్తీక పురాణం ప్రకారం.. కార్తీక మాసం రెండో రోజున ఇలా నదీ తీరంలో ఉన్న మట్టిని కానీ, ఆవు పాదాల కింద ఉన్న మట్టిని కానీ, తులసి కోటలో ఉన్న మట్టిని కానీ శరీరానికి రాసుకుని స్నానం చేస్తారో వారికి జన్మజన్మల పాపాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని కార్తీక పురాణం చెబుతోంది.

కార్తీక మాసం రెండో రోజు పూజా విధానం..
* హరిని తులసి దళాలతో పూజించాలి.
* అలాగే మారేడు దళాలతో పూజించాలి.
తులసి, మారేడు దళాలతో రెండో రోజు విష్ణువును పూజించినట్లైతే శుభఫలితాలు కలుగుతాయి.

కార్తీక మాసంలో రెండో రోజు కచ్చితంగా సాయంకాలం పూట శివాలయానికి వెళ్లి ఆలయంలో ధ్వజస్థంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఇది అద్భుతమైన శుభఫలితాలను కలిగిస్తుంది.

కార్తీక పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే.. కార్తీక మాసంలో రెండో రోజు ప్రతి ఒక్కరు శివాలయంలో ధ్వజ స్థంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి.