యమగండకాలం: కేతుకాలంలో దోషాలు తొలగడానికి ఏం చేయాలి?

గణపతి పాశుపతహోమము కూడా మంచిది. కేతుగ్రహానికి గరిక లేక దర్భలతో కూడా పూజించాలి.

యమగండకాలం: కేతుకాలంలో దోషాలు తొలగడానికి ఏం చేయాలి?

Ketu (Image Credit To Original Source)

Updated On : January 5, 2026 / 6:08 PM IST

Ketu Kalam: గణితపరంగా కేతుకాల విధానము

రాహుకాలములాగే కేతుకాలము కూడా ఉంది. మనకు తెలిసిన యమగండ కాలమునే కేతుకాలము అని అంటారు. కేతుకాలములో కేతువును పూజించటం వల్ల కేతుదోషములు తొలగుతాయి. ఈ కేతుకాలములో కేతువు ప్రతిమకు లేక విగ్రహానికి గంగాజలముతో పంచామృతముతో కేతువుకు ప్రీతికర మైన ఉలవలతో అష్టోత్తర శతనామములతో పూజించాలి.

ఉలవలతో చేసిన పదార్థములను నైవేధ్యముగా పెట్టాలి. ఈ కేతుకాలములో మహాగణపతిని పూజించటము వల్ల కేతువు బాధించడు. ఈ కేతుకాలములో సంకటహర గణపతి వ్రతము ఆచరించడము వల్ల కష్టములు తొలగిపోతుంది.

సుఖసౌఖ్యాలు, సంతోషం, సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. ఆదివారము లేక బుధవారము రోజున గణపతిని, కేతువును పూజించడము వల్ల జీవితములో అనేక ఆటంకములు తొలగుతాయి. ఈ కేతువుకాలములో శ్రీలక్ష్మీగణపతి హోమము లేక కేతువు హోమము చేస్తే మంచి జరుగుతుంది.

తొమ్మిది లేక పదకొండు గొప్పలలో నెయ్యివేసి దీపారాధన చేయాలి. ఈ కేతువుకాలములో దేవాలయములో కేతువు విగ్రహానికి సర్పసూక్త రుద్రనమక చమకములతో అభిషేకము చేయాలి. ఈ కాలములో సంకటహరగణపతి స్తోత్రపారాయణము చేస్తే కూడా మంచి ఫలితములు ఉంటాయి.

కేతుగ్రహ పీడా పరిహారానికి శ్రీమహాగణాధిపతి ఉపాసన చేసి 41 రోజులు ఆవుపాలతో శ్రీమహాగణపతికి చతురావృత్తి తర్పణము చేయడం వల్ల ఆటంకములు అన్నీ తొలగుతాయి. కేతుగ్రహశాంతి ప్రక్రియలలో ముఖ్యమైనది కేతుగ్రహపాశపతాస్త్రము, లేక గణపతిపాశుపతము.

ఇంట్లో కేతుగ్రహపాశుపత అభిషేకము హోమము చేయడం వల్ల కేతుగ్రహ శాంతి కలిగి కార్యవిజయం, మేధావృద్ధి కలిగి, జ్ఞానము ప్రకాశిస్తుంది. గణపతి పాశుపతహోమము కూడా మంచిది. కేతుగ్రహానికి గరిక లేక దర్భలతో కూడా పూజించాలి.