Maha Shivratri: ఆ జబ్బులు ఉన్న వారు ఉపవాసం ఉండొచ్చా? ఫాస్టింగ్ తర్వాత వెంటనే తినాల్సిన ఆహారం ఏంటి..
ఉపవాసం సమయంలో అస్సలు ఫుడ్ తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

Maha Shivratri Fasting Procedure: శివ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహా శివరాత్రి పర్వదినానికి ఘడియలు సమీపించాయి. ఇప్పటికే శివరాత్రి వేడుకకు పలు దేవాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఇక ఈ పండగ రోజున ఓం నమ: శివాయ, హర హర మహాదేవ శంభో శంకర మంత్రాలతో శివాలయాలు మార్మోగుతాయి.
ఇక శివరాత్రి అంటే శివయ్యకు పూజలు, అభిషేకాలతో పాటు ఉపవాసం, జాగరణ తప్పనిసరి. అయితే మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండే వారు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని డాక్టర్లు చెబుతున్నారు. మహా శివరాత్రి రోజున ఎవరెవరు ఉపవాసం ఉండొచ్చు? ఎవరెవరు ఉండకూడదు? ఉపవాసం ఉన్న సమయంలో తప్పకుండా తినాల్సినవి, తాగాల్సినవి ఏంటి? ఉపవాస విరమణ తర్వాత వెంటనే తినకూడని ఆహార పదార్దాలు ఏంటి? అసలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
వయసు మీద పడ్డ వాళ్లు, కొన్ని జబ్బులు ఉన్న వ్యక్తులు ఉపవాసం చేయకపోవడమే మంచిది అంటున్నారు డాక్టర్లు. అలాంటి వ్యక్తులు తమ శరీరాన్ని స్ట్రెస్ కు గురి చేయడం వారి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. అంతేకాదు.. ఉపవాసం సమయంలో కచ్చితంగా నీరు తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read : మహాశివరాత్రి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టే!
”65, 70 ఏళ్లు దాటిన వాళ్లు.. షుగర్, బీపీ కంట్రోల్ లేని వాళ్లు.. హార్ట్, కిడ్నీ, లివర్ జబ్బులు ఉన్న వాళ్లు.. ఫాస్టింగ్ చేయకపోవటం మంచిది. ఫాస్టింగ్ వల్ల బాడీని హై స్ట్రెస్ లోకి పంపినట్లు అవుతుంది. ఉపవాసం సమయంలో అస్సలు ఫుడ్ తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. బీపీ, హార్ట్ రేట్, షుగర్ లెవెల్స్ పెరగటం లేదా తగ్గటం జరుగుతాయి. ఆహారం తీసుకోకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు. అసలు.. మేము ఉపవాసం ఉండొచ్చా? లేదా? అని తమ డాక్టర్ తో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.
ఉపవాసంలో చాలా మంది చేసే తప్పు నీరు తీసుకోకపోవడం. అలా చేయడం బిగ్ మిస్టేక్. నీరు తాగకపోవడం వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. హైడ్రేషన్ సరిగా చేయాలి. నీళ్లను బాగా తాగాలి. ఉపవాసం అనగానే చాలామంది నీరు కూడా తీసుకోరు. అలా చేస్తే మొదట ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ. అందుకే, కిడ్నీని సేవ్ చేయాలంటే హైడ్రేట్ చేస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి” అని జనరల్ ఫిజీషియన్ డాక్టర్ దిలీప్ గుడె తెలిపారు.
ఉపవాస విరమణ తర్వాత వెంటనే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
”ఉపవాసం అయిపోయిన వెంటనే ఫుడ్ తీసుకోవాలి అనుకుంటే.. హెవీగా ఉన్న ఫుడ్ తీసుకోవద్దు. అలా తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. ఫాస్టింగ్ విడిచిన వెంటనే రైస్ పేస్ట్ కానీ సాబుదానా పేస్ట్ కానీ కిచిడీ కానీ.. ఇలా ఈజీగా డైజస్ట్ అయ్యే ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవాలి. అదే సమయంలో ఫాస్టింగ్ సమయంలో హైడ్రేషన్ చాలా ముఖ్యం. హైడ్రేషన్ తో పాటు పాలు, పండ్లు కొంచెం కొంచెంగా తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఆకలి విపరీతంగా పెరగకుండా ఉంటుంది” అని న్యూట్రిషియనిస్ట్ డాక్టర్ శిరీష తెలిపారు.
పిల్లలు ఫాస్టింగ్ ఉండొచ్చా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
”పిల్లలు గ్రోయింగ్ స్టేజ్ లో ఉంటారు. చదువుకుంటూ ఉంటారు. వాళ్ల బ్రెయిన్ యాక్టివ్ గా ఉండాలంటే కనీస కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నవి బాడీకి అందాల్సి ఉంటుంది. ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఇవేమీ ఇవ్వవు. లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటాం. ఇలా చేసినప్పుడు షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి. దాంతో పిల్లలు సిక్ అయిపోతారు.
రాత్రంతా పడుకోకపోవడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా ఉండదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్లు, స్ట్రెస్ ఫ్రీ ఉన్నప్పుడు ఎలాంటి ఫాస్టింగ్ చేసినా బాడీ మెటబాలజిమ్ లో పెద్దగా మార్పులు ఉండవు. పిల్లలు కూడా ఫాస్టింగ్ చేయొచ్చు. కానీ, వాళ్లకు కనీస ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ వెళ్లాలి. ఆ విధంగా ఫాస్టింగ్ చేస్తే ప్రాబ్లమ్ లేదు. డయాబెటిస్ ఉన్న వారు ఫాస్టింగ్ చేయాలంటే.. మెడికేషన్, డైటింగ్ చూసుకుని చేసుకోవాలి. లేదంటే ఆసుపత్రి పాలు కావాల్సి ఉంటుంది” అని న్యూట్రిషియనిస్ట్ డాక్టర్ శిరీష తెలిపారు.