మకర సంక్రాంతి రోజున చేయకూడని పనులు ఏంటి? ఒకవేళ చేశారో.. 

గరుడ పురాణం ప్రకారం ఇటువంటి వారికి నరకంలో కఠిన శిక్షలు ఉంటాయి. శూలప్రోత నరకాన్ని అనుభవిస్తారు.

మకర సంక్రాంతి రోజున చేయకూడని పనులు ఏంటి? ఒకవేళ చేశారో.. 

Sankranthi (Image Credit To Original Source)

Updated On : January 13, 2026 / 6:49 PM IST
  •  ఇతరులను బాధపెట్టే, ప్రకృతికి హానిచేసే పనులు చేయొద్దు
  • వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటివి తినొద్దు
  • స్నానం చేయకపోతే ఏడు జన్మల పాటు రోగాలు

Sankranti 2026: మకర సంక్రాంతి రోజు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. పండుగ రోజు ఇతరులతో చెడుగా ప్రవర్తించొద్దు.
ఇతరులను బాధపెట్టే, ప్రకృతికి హాని చేసే పనులకు దూరంగా ఉండాలి.

పండగ రోజు గొడవలు పడొద్దు, ఆస్తులు తగాదాల గురించి మాట్లాడొద్దు, చుట్టాలందరం ఒకచోట చేరాం కదా అంటూ పేకాట ఆడుకోవద్దు. పెద్దవాళ్లతో తగాదాలు పడవద్దు, పెట్టుబడుల విషయాలు మాట్లాడకూడదు.

ఏ పర్వదినాన్నైనా సంతోషంగా ఉంటూ, ఇతరులను సంతోషంగా ఉండనివ్వాలి. హాయిగా భోజనం చేయాలి. ఇప్పుడు మనం చేసే భగవత్ ధ్యానము, మన మంచితనము, మన ప్రేమ రేపు మనకి ప్లస్ కావచ్చు.

మీ ఇంట్లో బొమ్మలు పెడితే హాయిగా పేరంటానికి పిలవండి. శెనగలు, పండ్లు అందరికీ ఇచ్చుకోండి. ఆ తర్వాత పసుపు కుంకుమలు ఇవ్వాలి. అంతేగానీ, గొడవలు పడితే పూజాఫలం ఎలా వస్తుంది.

Also Read: Sankranthi 2026: సంక్రాంతి రోజున ఏం చేయాలి? ఎందుకు చేయాలి?

ఈ పండుగను భక్తి, శ్రద్ధలతో నిర్వహిస్తే సూర్య భగవానుడి ఆశీస్సులు ఉంటాయి. భోగి, సంక్రాంతి, కనుమ నాడు స్నానం తప్పనిసరిగా చేయాల్సిందే. ఒకవేళ చేయకపోతే ఏడు జన్మల పాటు రోగాల బారిన పడతారు. సూర్య సంక్రమణం వేళ స్నానం చేస్తే చాలా మంచిది.

ఈ పండుగ రోజు కోడి పందేలు ఆడొద్దు, చూడొద్దు. మూగజీవాల వంటివి రక్తం వచ్చేలా తలపడుతుంటే అది చూసి ఆనందించడం శాస్త్రపరంగా మహాపాపం. గరుడ పురాణం ప్రకారం ఇటువంటి వారికి నరకంలో కఠిన శిక్షలు ఉంటాయి. శూలప్రోత నరకాన్ని అనుభవిస్తారు. అలాగే, మీకు తదుపరి జన్మ ఉంటే ఆ జన్మలో ప్రతి రోజు ఒంటి నొప్పులు వస్తాయి.

ఈ పండుగ రోజున మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు, మనం ఇంట్లో వాడే వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటివి కూడా తినొద్దు. సన్యాసి మీ ఇంటికి అతడికి ఏమైనా పెట్టాలి.

NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.