Maharnavami: అక్టోబర్ 1.. మహర్నవమి.. పూజ ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి..!

మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం, విఘ్నం వస్తుంటే.. అనుకున్న పనులు అవ్వకపోతే..

Maharnavami: అక్టోబర్ 1.. మహర్నవమి.. పూజ ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి..!

Updated On : October 1, 2025 / 1:02 AM IST

Maharnavami: దేవీ నవరాత్రుల్లో అక్టోబర్ 1న మహర్నవమి. మరి ఈ రోజున పూజ ఏ విధంగా చేస్తే సకల శుభాలు చేకూరతాయో తెలుసుకుందాం. దేవీ నవరాత్రుల్లో అక్టోబర్ 1న బుధవారం మహర్నవమి వచ్చింది. దేవీ నవరాత్రులు అన్నీ ఒక ఎత్తైతే మహర్నవమి మరొక ఎత్తు. ఈ ఒక్క రోజు పూజ చేస్తే అన్ని రోజులు పూజ చేసిన విశేషమైన ఫలితం దక్కుతుంది.

మహర్నవమి రోజున ఏం చేయాలి? ఈ రోజు ఏ చిన్న స్త్రోతం చదువుకున్న, ఏ చిన్న మంత్రం జపించుకున్నా.. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావొచ్చు. మహర్నవమి రోజున అమ్మవారికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు చదువుకున్నా లేదా విన్నా అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పాత్రులు కావొచ్చు.

మహర్నవమి రోజున చదువుకోవాల్సిన లేదా వినవలసిన స్తోత్రాల్లో మొట్టమొదటిది దుర్గా కవచం. మార్కండేయ మహర్షి బ్రహ్మ దేవుడిని ప్రారంభినప్పుడు బ్రహ్మ దేవుడు కేవలం స్మరణతో మాత్రంతోనే పాపాలు భస్మమైపోయేటటువంటి దుర్గా కవచాన్ని మార్కండేయ మహర్షికి బ్రహ్మ దేవుడు చెబుతాడు. కాబట్టి స్మరించడంతోనే పాపాలన్నీ భస్మీపటలమైపోయి శక్తి కవచంలా కాపాడే స్తోత్రం దుర్గా కవచం. మహర్నవమి రోజున దుర్గా కవచం చదివినా, విన్నా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.

మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం, విఘ్నం వస్తుంటే.. అనుకున్న పనులు అవ్వకపోతే ధర్మ రాజ కృత దుర్గా స్తుతిని చదవాలి. దుర్గాష్టమి రోజున లేదా మహర్నవి రోజున చదివినా లేదా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు అజ్ఞాతవాసంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేందుకు మహర్షుల సలహా మేరకు ధర్మరాజు
దుర్గాదేవిని ప్రార్థిస్తారు. దాన్నే ధర్మ రాజ కృత దుర్గా స్తుతి అంటారు.

దేవీ నవరాత్రుల్లో దుర్గాష్టమి లేదా మహర్నవమి రోజున ఈ స్త్రోతం విన్నా, చదివినా అద్భుత ఫలితాలు కలుగుతాయి. పనుల్లో ఆటంకాలు ఉండవు, విఘ్నాలన్నీ తొలగిపోతాయి.

అలాగే అర్జున కృత దుర్గా స్తోత్రం ఉంటుంది. కురుక్షేత్రంలో అర్జునుడు శత్రువుల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందుగా దుర్గాదేవిని స్తుతిస్తాడు. అంటే కురుక్షేత్రంలో ఎవరూ కూడా అర్జునుడిని ఏమీ చేయకుండా ఉండేందుకు, శత్రువుల మీద విజయం సాధించడానికి దుర్గాదేవిని అర్జునుడు స్తుతి చేసినటువంటి స్తోత్రమే అర్జున కృత దుర్గా స్తోత్రం. దేవీ నవరాత్రుల్లో చదివినా, విన్నా శత్రు బాధలు తొలగిపోతాయి. అలాగే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావొచ్చు.

మహర్నవమి అంటేనే చాలా శక్తిమంతమైన రోజు. అన్ని పూజలు త్వరగా నెరవేరేటటువంటి రోజు. అందుకే మహర్నవమి రోజు ఈ స్తోత్రాలు చదువుకుని అమ్మవారి సంపూర్ణమైన అనుఘ్రమానికి ప్రతి ఒకరు సులభంగా పాత్రులు కావొచ్చు.