Ugadi 2025 : ఉగాది పచ్చడి ఎప్పుడు తినాలి? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల మధ్య తినొచ్చు.. ముహూర్తం టైమింగ్ ఇదే..

ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీక అని శాస్త్రం చెబుతోంది.

Ugadi 2025 : ఉగాది పచ్చడి ఎప్పుడు తినాలి? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల మధ్య తినొచ్చు.. ముహూర్తం టైమింగ్ ఇదే..

Updated On : March 29, 2025 / 7:44 PM IST

Ugadi 2025 : చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున కృత యుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజున (2025, మార్చి 30) ఉగాది పండగ జరుపుకుంటాం. ఉడాది పండగతో తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మార్చి 30 నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు.

తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. సాధారణంగా ఏ పండగ రోజైనా ప్రత్యేకంగా పిండి వంటలు, పాయసం లాంటి వంటకాలు ఉంటాయి. కానీ ఉగాది స్పెషల్ మాత్రం ఉగాది పచ్చడే. షడ్రుచుల సమ్మేళనంగా తయారయ్యే ఉగాది పచ్చడి తెలుగువారికి మాత్రమే సొంతం. జీవితంలో వచ్చే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది.

ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీక అని శాస్త్రం చెబుతోంది. ఉగాది పచ్చడి తయారీలో తీపి(బెల్లం), పులుపు(చింతపండు), కారం(మిరపకాయలు, మిరప్పొడి), ఉప్పు, చేదు(వేప పువ్వు), వగరు(లేత మామిడి పిందెలు) అనే ఆరు రకాల రుచులు ఉంటాయి.

Also Read : పంచాంగాన్ని ఎందుకు వినాలి? విశ్వావసు నామ సంవత్సరం అనే పేరు ఎలా వచ్చింది?

ఉగాది రోజు కచ్చితంగా ఉగాది పచ్చడి తింటారు. మరి.. ఉగాది రోజున ఉగాది పచ్చడి ఎప్పుడు తినాలి? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల మధ్య తినొచ్చు? ఉగాది పచ్చడి తినడానికి ముహూర్తం ఏంటి? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు..

2025 మార్చి 30.. అనగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం నాడు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. ఉదయం 5 గంటల నుంచి 7గంటల 30 నిమిషాలకు వరకు పూజ చేసుకోవడానికి శుభ సమయం. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల లోపల నూతన వస్త్రధారణ, నూతన యజ్ఞోపవీత ధారణ చేయడానికి, ఉగాది పచ్చడి తీసుకోవడానికి శుభ సమయం అని పండితులు చెబుతున్నారు.

ఇక, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల లోపల పసుపు, బెల్లం, చింతపండు, బంగారం, వెండి మొదలైన శుభకరమైన వస్తువులు కొనడానికి శుభ సమయం అని పండితులు తెలియజేశారు.

షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుందని.. ఇందులోని ఒక్కో పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక అని పెద్దలు చెబుతారు.