10 Strongest Currency List : ప్రపంచంలో అత్యంత 10 బలమైన కరెన్సీల జాబితా ఇదే.. చివరి స్థానంలో డాలర్.. భారత కరెన్సీ ఎక్కడంటే?

10 Strongest Currency List : ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికా డాలర్ పదో స్థానంలో ఉంది. భారత కరెన్సీ రూపాయి 15వ ర్యాంకులో నిలిచింది.

10 Strongest Currency List : ప్రపంచంలో అత్యంత 10 బలమైన కరెన్సీల జాబితా ఇదే.. చివరి స్థానంలో డాలర్.. భారత కరెన్సీ ఎక్కడంటే?

10 strongest currencies in the world _ US Dollar Ranks Last and India At Rank in Forbes List

World’s 10 Strongest Currency List : ప్రతి దేశానికి కరెన్సీ అనేది చాలా ముఖ్యం.. అదే.. ఆ దేశ ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. ప్రపంచ వాణిజ్యానికి కరెన్సీనే జీవనాధారంగా చెప్పవచ్చు. అంతేకాదు.. దేశం ఆర్థిక శక్తిని కూడా ప్రతిబింబిస్తుంది. కరెన్సీ బలం ఆ దేశం స్థిరత్వం, బలమైన ఆర్థిక స్థితికి నిదర్శనం కూడా. కరెన్సీ విలువ పెరుగుతున్న కొద్దీ.. దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా బలపడుతుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఇదే కరెన్సీ దేశంలో పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుంది. ఒక బలమైన కరెన్సీ ఆర్థికపరమైన ఒడిదొడుకులను ఎదుర్కొని దేశాలను శక్తివంతం చేయగలదు.

Read Also : Hyundai Creta 2024 Facelift : కొత్త కారు కొంటున్నారా? హ్యుందాయ్ క్రెటా 2024 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

అత్యంత 10 బలమైన కరెన్సీల జాబితా విడుదల : 
అయితే, ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా 180 కరెన్సీలను చట్టబద్ధమైనదిగా గుర్తించింది. కొన్ని కరెన్సీలు అత్యంత జనాదరణ పొందాయి. కరెన్సీ బలం అనేది సరఫరా, డిమాండ్ బట్టి మారుతుంటుంది. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం నుంచి భౌగోళిక రాజకీయ స్థిరత్వం వంటి కారకాలచే ప్రభావితమవుతుంది. అలాంటి ప్రపంచంలోని అత్యంత 10 బలమైన కరెన్సీలకు సంబంధించి జాబితాను గ్లోబల్ మీడియా కంపెనీ ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ బలమైన కరెన్సీల ప్రాముఖ్యతకు దోహదపడే అంశాలను కూడా జాబితాలో ప్రస్తావించింది.

మొదటి ర్యాంకులో కువైట్ దినార్ :
ఈ జాబితాలో మొదటి స్థానంలో కువైట్ దినార్ ఉందని ఫోర్బ్స్ పేర్కొంది. ఒక కువైట్ దినార్ 3.25డాలర్ల విలువ భారత రూపాయి కరెన్సీలో (రూ. 270.23)కు సమానం. రెండో స్థానంలో బహ్రెయిన్ దినార్ నిలవగా.. దీని విలువ 2.65 డాలర్లతో భారత కరెన్సీలో రూ. 220.4కు సమానంగా ఉంది.

ఆ తర్వాతి స్థానంలో ఒమానీ రియాల్ (రూ. 215.84) 2.60 డాలర్లు, జోర్డానియన్ దినార్ (రూ. 117.10) విలువ 1.141 డాలర్లు, జిబ్రాల్టర్ పౌండ్ (రూ. 105.52) 1.27డాలర్లు, బ్రిటిష్ పౌండ్ (రూ. 105.54) 1.27 డాలర్లు, కేమన్‌ దీవుల డాలర్‌ (రూ.99.76) విలువ 1.20 డాలర్లు, స్విస్ ఫ్రాంక్ (రూ. 97.54) 1.17 డాలర్లు, యూరో (రూ. 90.80) 1.09 డాలర్లకు సమానంగా ఉన్నాయి.

10 strongest currencies in the world _ US Dollar Ranks Last and India At Rank in Forbes List

10 strongest currencies in the world

10వ ర్యాంకులో అమెరికా డాలర్.. 15వ ర్యాంకులో మన రూపాయి :
ఆసక్తికరంగా, అమెరికా డాలర్ బలమైన కరెన్సీల జాబితాలో చివరి పదో స్థానంలో నిలిచింది. ఒక డాలర్ విలువ (భారత కరెన్సీలో రూ. 83.10)తో ర్యాంక్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ అత్యంత విస్తృతంగా వినియోగిస్తున్న కరెన్సీ అయినప్పటికీ.. ప్రాథమిక రిజర్వ్ కరెన్సీగా స్థానం కలిగి ఉందని ఫోర్బ్స్ తెలిపింది. డాలర్‌కు ప్రజాదరణ ఉన్నప్పటికీ.. ప్రపంచంలోని బలమైన కరెన్సీలలో 10వ స్థానంలో నిలవడం గమనార్హం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) వెబ్‌సైట్‌లో బుధవారం ప్రచురించిన మారకపు రేటు ప్రకారం.. అమెరికా డాలర్‌కు రూ.82.9 విలువతో భారత కరెన్సీ 15వ స్థానంలో నిలిచింది.

1960 నుంచి స్థిరంగా కువైట్ దినార్ కరెన్సీ :
జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన కువైట్ దినార్.. 1960లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా నిలకడగా అదే ర్యాంకింగ్‌లో స్థిరంగా కొనసాగుతోంది. కువైట్ ఆర్థిక స్థిరత్వం, అక్కడి చమురు నిల్వలు, పన్ను రహిత వ్యవస్థ వంటివి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆ తర్వాత స్విట్జర్లాండ్, లిచెన్‌స్టెయిన్ కరెన్సీ అయిన స్విస్ ఫ్రాంక్.. ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన కరెన్సీగా విస్తృతంగా వినియోగంలో ఉందని ఫోర్బ్స్ తెలిపింది. 2024 జనవరి 10 నాటికి ఉన్న కరెన్సీ విలువల ఆధారంగా ఈ జాబితాను విడుదల చేసినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. అయితే, ఈ కరెన్సీ విలువలు హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయని జాబితాలో పేర్కొంది.

Read Also : Tata Punch EV Launch : టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేసిందోచ్.. సింగిల్ ఛార్జ్‌తో 421కి.మీ దూసుకెళ్లగలదు.. ధర ఎంతో తెలుసా?