10 గ్రాముల బంగారం ధర ఆలోగా రూ.70 వేలకు చేరనుందా? ఇప్పుడే కొంటే?

Gold Prediction: పెట్టుబడులకు బంగారం ఓ వరంలాంటిదని అంటున్నారు. పసిడి ఒక స్థిరాస్తి. అది ఆర్థిక సంక్షోభం..

10 గ్రాముల బంగారం ధర ఆలోగా రూ.70 వేలకు చేరనుందా? ఇప్పుడే కొంటే?

బంగారం ధరలు ఈ ఏడాది చివరి నాటికి 10 గ్రాములకు రూ.70 వేలకు చేరుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అంతగా పెరగదని ముందుగా భావించారు. అయితే, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలు, మార్కెట్ పోకడలను బట్టి ధన అంతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

బ్యాంక్ బజార్.కామ్ సీఈవో దీని గురించి పలు వివరాలు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, ద్రవ్యోల్బణం పెరగడం, పలు దేశాల్లో నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి వంటి వాటిని బట్టి చూస్తే బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తూ 10 గ్రాముల బంగారం ధర ఈ ఏడాది చివరి నాటికి రూ.66 వేల మార్కు దాటవచ్చని, అయితే, ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, రాజకీయ అనిశ్చితి వంటివి కుదటపడకపోతే రూ.70 వేలకు పెరగవచ్చని మరో విశ్లేషకుడు చెప్పారు.

కాగా, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభంతో పాటు అంతర్జాతీయంగా భౌగౌళిక ఉద్రిక్తతలు, మిలటరీ ఘర్షణలు వంటివి కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యే అవకాశం ఉంది. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీరు వల్ల బంగార ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులకు బంగారం ఓ వరంలాంటిదని అంటున్నారు. పసిడి ఒక స్థిరాస్తి. అది ఆర్థిక సంక్షోభం సమయంలో ఆపన్న హస్తంలా మారుతుంది.

Also Read: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఈ సారి ఐఫోన్ 16 సిరీస్‌లో వచ్చేవి కేవలం 4 మోడళ్లు కాదు..