ప్రపంచ టాప్-10 అత్యుత్తమ CEOల్లో ముగ్గురు భారతీయులు

ప్రపంచ టాప్ 10 అత్యుత్త సీఈఓల జాబితాలో భారతీయ సంతతికి చెందిన ముగ్గురు సీఈఓలకు చోటు దక్కింది. హ్వార్వర్డ్ బిజినెస్ రివ్యూ (HBR) రూపొందించిన ప్రపంచంలోని టాప్ 10 అత్యుత్తమ పనితీరు గల సీఈఓల జాబితా 2019ను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతీయ సంతతికి చెందిన ముగ్గురు సీఈఓలు శంతను నారాయణ్, సత్య నాదెళ్ల, అజయ్ బంగాలు టాప్ 10 అత్యుత్తుమ సీఈఓల జాబితాలో నిలిచారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు గల సీఈఓలు- 2019 జాబితాలో 100 మంది సీఈఓలు ఉన్నారు.
వీరిలో అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అగ్రస్థానంలో నిలిచారు. టాప్ 10 చీఫ్ ఎగ్జిక్యూటీవ్స్ జాబితాల్లో మూడు స్థానాల్లో భారతీయ సంతతి సీఈఓలే చోటు దక్కించుకున్నారు. ఆరో స్థానంలో అడోబ్ సీఈఓ నారాయణ్ నిలవగా, మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా 7వ ర్యాంకులో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 9వ ర్యాంకులో ఉన్నారు.
ఈ జాబితాలో భారత సంతతికి చెందిన DBS బ్యాంకు సీఈఓ పీయూష్ గుప్తా 89వ ర్యాంకులో నిలిచారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మాత్రం 62వ ర్యాంకులో నిలిచారు. అంతేకాదు.. నైక్ సీఈఓ మార్క్ పార్కర్ 20 ర్యాంకులో నిలవగా, జేపీ మోర్గాన్ చేజ్ చీఫ్ జామై డైమన్ (23), లాక్ హీడబ్ మార్టిన్ సీఈఓ మారిల్లియాన్ హ్వెసన్ (37), డిస్నీ సీఈఓ రాబర్ట్ లెగర్ (55), సాఫ్ట్ బ్యాంకు హెడ్ మాసయోషీ సన్ (96) ర్యాంకుల్లో నిలిచారు. 2015 నుంచి HBR విడుదల చేస్తున్న ఈ జాబితాను కేవలం ఆర్థిక పనితీరుపై మాత్రమే కాకుండా పర్యావరణం, సామాజిక, పాలన (ESG) రేటింగ్స్ పై కూడా ర్యాంకులను ప్రకటిస్తోంది.
నలుగురు మహిళా సీఈఓలు :
2014 నుంచి ప్రతి ఏడాది ఆర్థిక పనితీరు ఆధారంగా రిలీజ్ చేసే జాబితాలో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ టాప్ సీఈఓగా నిలుస్తున్నారు. ఈ ఏడాది జాబితాలో ఈసీజీ స్కోరు దిగువ స్థాయికి పడిపోయింది. 2019 టాప్ సీఈఓల జాబితాల్లో సగానికి పైగా ర్యాంకుల్లో నలుగురు మహిళా సీఈఓలు నిలిచారు. 2018లో ముగ్గురు మహిళా సీఈఓలు నిలవగా, అంతకుముందు ఏళ్లల్లో ఇద్దరు మహిళా సీఈఓలు మాత్రమే జాబితాలో చోటు దక్కించుకున్నారు. సగటున పరిశీలిస్తే.. టాప్ సీఈఓల జాబితాలో 45 సంవత్సరాల వయస్సులో CEOలుగా 15 సంవత్సరాల కార్యాలయంలో ఉన్నవారే ఎక్కుమంది ఉన్నారు.