సిబిల్ స్కోర్ రాకెట్ లా పైకి వెళ్లడానికి 5 గేమ్ ఛేంజర్ టిప్స్.. 2,5 టిప్స్ అయితే వండర్ ఫుల్..
మీ సిబిల్ స్కోర్ ని లైట్ తీసుకోకండి.. ఇవి మాత్రం అసలు చేయకండి.

pc:shutterstock
CIBIL Score Increasing Tips: మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటేనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఇతర మైక్రో ఫైనాన్స్ సంస్థలు లోన్ లేక క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి ముందుకు వస్తాయిన్న విషయం తెలిసిందే. మనం అప్లై చేసుకున్న లోన్ ఆమోదం పొందాలన్న మనకున్న క్రెడిట్ స్కోరే టాప్ ప్రయారిటీ గా తీసుకుంటాయి బ్యాంకింగ్ సంస్థలు. అంతేగాక తక్కువ వడ్డీ రుణాలు కూడా సిబిల్ స్కోర్ బలంగా ఉన్నవాళ్లకే ఇస్తారు.
ఇండియాలో ‘సిబిల్ స్కోర్’ ని చెప్పే క్రెడిట్ బ్యూరోలు నాలుగు ఉన్నాయి అవి ఏంటంటే.. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (CIBIL), Equifax, Experian, CRIF Highmark. వీటిలో అత్యంత ప్రాముఖ్యతగలది CIBIL అని మనకు తెలిసిన విషయమే.
మంచి CIBIL స్కోర్ రేంజ్ ఎంతంటే..?
- 750కి పైగా స్కోర్ ఉంటే బెస్ట్ అనుకోవచ్చు.
- 650-749 మధ్యన స్కోర్ ఉంటే గుడ్ అనుకోవచ్చు.
- 500-649 మధ్యన స్కోర్ ఉంటే యావరేజ్ గా భావిస్తారు.
- 499కి తక్కువ స్కోర్ అయితే మాత్రం దాన్ని పూర్ అంటారు.
క్రెడిట్ స్కోర్ మెరుగుపరుచుకోవడానికి సులభమైన పద్ధతులు:
1) డ్యూ అమౌంట్ ఇన్ టైం లో చెల్లించడం: మీకున్నఅన్ని క్రెడిట్ కార్డు బిల్లులు, EMIలు సమయానికి చెల్లించడం చాలా ముఖ్యం. మనీ లేకనో లేక ఇతర కారణాల వల్ల కట్టడం లేట్ అయితే మీ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంది. చివరకు ‘మినిమమ్ డ్యూ అమౌంట్’ అయినా కట్టాలి. అంతేగాని వచ్చే నెలకో వాయిదా వేయడం, తర్వాత కడుదాం అంటే మాత్రం మీ క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
Also, Read: ఇంటి, కారు లోన్ క్లోజ్ చేస్తున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు!
2) క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో: మీ క్రెడిట్ కార్డు లిమిట్ ని 100% వాడకపోవడం చాలా ఉత్తమం. ఆర్థిక నిపుణుల ఏమి చెబుతున్నారంటే 30% కన్నా తక్కువ మొత్తాన్ని ఉపయోగించడం వలన మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటుందని, ఏదైనా అనుకోకుండా అవసరం వచ్చి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తే బిల్లింగ్ డేట్ రాకముందే కట్టాలని, ఒకవేళ పూర్తిగా కట్టని యెడల ఆ అమౌంట్ ని EMI లోకి మార్చుకొని ప్రతి నెల EMI చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది అంటున్నారు.
3) లోన్ వ్యవధి కాలం తక్కువ ఉంటె మంచిది: కొంత మంది తక్కువ డబ్బులు లోన్ తీసుకొని లేక తక్కువ విలువ గల ఏదైనా ప్రోడక్ట్ కొని దానిని ఎక్కువ సంవత్సరాలు EMI పెట్టుకోవడం కూడా సిబిల్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. మీకున్న డ్యూ అమౌంట్ ని ఎంత తొందరగా క్లియర్ చేస్తే అంత మంచిది.
4) కొత్త లోన్లు, క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు: ఉన్న క్రెడిట్ కార్డు బిల్లులను కట్టడం కోసం లేక ఇతర ఆర్థిక అవసరాల కోసం మరొక బ్యాంకు క్రెడిట్ కార్డు లేక లోన్ అప్లై చేయడం అది కూడా వెనువెంటనే చేయడం వలన కూడా క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. ఇతర బ్యాంక్ క్రెడిట్ కార్డు కన్నా.. ఉన్న క్రెడిట్ కార్డు లిమిట్ ని పెంచుకొని వాడటం ఉత్తమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
5) ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్: కొంత మంది క్రెడిట్ కార్డు పోవడం వలన లేక ఇతర కారణాల వలన క్రెడిట్ కార్డు లను బ్లాక్ చేస్తూ క్లోజ్ చేస్తారు. దీనివలన క్రెడిట్ స్కోర్ తగ్గే ఛాన్స్ ఉంది. నిపుణులు ఏమీ చెబుతున్నారంటే.. ఒకవేళ కార్డు పోయిన వేరే కార్డు తీసుకొని అకౌంట్ ని కొనసాగించాలని అంటున్నారు. పాత క్రెడిట్ కార్డు లను మీరు వాడకపోయినా యాక్టీవ్ గా ఉంచడం వలన మీ క్రెడిట్ హిస్టరీ పెరిగి మీకు హౌస్ లోన్ లు వంటి ఎక్కువ డబ్బు వచ్చే లోన్ తక్కువ వడ్డీతో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.