MSME Day: వెలుగులోకి రాని హీరోలకు మద్దతు ఇవ్వడం ప్రత్యేకంగా ఒక దినోత్సవం

ఈ MSMEల భద్రత, సహాయక సిబ్బంది ఎక్కువగా నిరాడంబరమైన నేపథ్యాల నుంచి వస్తారు. వీరు మంచి జీవనోపాధి అవకాశాలను కోరుకుంటారు. సుదీర్ఘ పని గంటలు, అంతగా స్నేహపూర్వకంగా లేని ఉద్యోగ విధి విధానాలు కొన్నిసార్లు వారిని నిరుత్సాహపరుస్తాయి

MSME Day: వెలుగులోకి రాని హీరోలకు మద్దతు ఇవ్వడం ప్రత్యేకంగా ఒక దినోత్సవం

Updated On : June 27, 2023 / 8:34 PM IST

Security Persons: వెలుగులోకి రాని హీరోలకు మద్దతు ఇవ్వడం ప్రత్యేకంగా MSME దినోత్సవాన్ని నిర్వహిస్తోంది హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఫిన్-టెక్ సంస్థ రికార్డెంట్. ఇందు కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్ (NI-MSME)తో భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, గుర్తింపు పొందిన MSMEలలో వెలుగులోకి రాని సహాయక సిబ్బందిని హీరోలుగా అభివర్ణిస్తూ గొడుగులను పంపిణీ చేయనున్నాయి.

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్ లీక్.. భారత్‌లో వార్షిక సేల్ ఎప్పటినుంచంటే?

ఈ MSMEల భద్రత, సహాయక సిబ్బంది ఎక్కువగా నిరాడంబరమైన నేపథ్యాల నుంచి వస్తారు. వీరు మంచి జీవనోపాధి అవకాశాలను కోరుకుంటారు. సుదీర్ఘ పని గంటలు, అంతగా స్నేహపూర్వకంగా లేని ఉద్యోగ విధి విధానాలు కొన్నిసార్లు వారిని నిరుత్సాహపరుస్తాయి. వారి సహకారాలు విలువైనవని, అందుకే ఎక్కువ ప్రశంస నీయతని వారికి చూపించడం ముఖ్యమని ఫిన్-టెక్ సంస్థ ప్రతినిధులు అన్నారు.

Reliance Jio Phone 5G : అతి చౌకైన ధరకే జియో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? లాంచ్ డేట్ ఎప్పుడంటే?

రికార్డెంట్, NI-MSMEల ఈ భాగస్వామ్యం MSMEల ఈ గుర్తింపు పొందని హీరోలను గుర్తించి, వారికి అవసరమైన మద్దతు అందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి వారి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమం MSME రంగంలో సానుకూల పని వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా భద్రత, సహాయక సిబ్బంది యొక్క శ్రేయస్సు, ప్రేరణకు దోహదపడుతుంది. వాతావరణ పరిస్థితుల నుండి అవసరమైన రక్షణను అందించడానికి, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ భావాన్ని పెంపొందించడానికి ఉచితంగా, అధిక-నాణ్యత, మన్నికైన గొడుగులు వారికి అందించబడతాయి.