Adani Group: హిండెన్‌బర్గ్‭తో పోరాటానికి అమెరికాలోని టాప్ న్యాయ కంపెనీలను నియమించుకున్న అదానీ

విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ముందస్తుగానే చెల్లించేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం తీవ్ర ఒడిదుడుకులతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ రుణాల చెల్లింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వ్యాపార విస్తరణ నిమిత్తం బ్యాంకుల నుంచి అదానీ గ్రూప్ 4.5 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ఇందులో కొంత రుణాన్ని మార్చి 9 నాటికి చెల్లించాలి.

Adani Group: హిండెన్‌బర్గ్‭తో పోరాటానికి అమెరికాలోని టాప్ న్యాయ కంపెనీలను నియమించుకున్న అదానీ

Adani Group hires top US law firm Wachtell in battle against Hindenburg

Updated On : February 10, 2023 / 4:45 PM IST

Adani Group: ఒక్క రిపోర్టుతో తీవ్రంగా నష్టపోయిన అదానీ గ్రూప్.. హిండెన్‌బర్గ్ సంస్థతో పోరాటానికి సిద్ధమయ్యారు. అమెరికాకు చెందిన న్యాయ కంపెనీలైన వాచ్‌టెల్, లిప్టన్, రోసెన్ & కాట్జ్‌లను నియమించుకున్నట్లు బ్రిటీష్ దినపత్రిక తాజాగా వెల్లడించింది. ఇందులో వాచ్‌టెల్ ప్రధానంగా అదానీ గ్రూప్‌కు చట్టపరమైన, నియంత్రణ, ప్రజా సంబంధాలను సమన్వయం చేయడంపై దృష్టి పెడుతుందని సమాచారం. 44 బిలియన్ డాలర్ల టేకోవర్ డీల్‌ను వెనక్కి తీసుకున్నందుకు ఎలాన్ మస్క్‌పై దావా వేసినప్పుడు లా కంపెనీ ట్విట్టర్‌కు ప్రాతినిధ్యం వహించింది.

Recruitment Of Medical Officer : తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా వైద్యఆరోగ్య శాఖలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ !

హిండెన్‌బర్గ్‭ నివేదిక అనంతరం వారం రోజులుగా అదానీ గ్రూప్‌లోని కంపెనీల షేర్ల ధరలు గణనీయంగా పడిపోతూనే ఉన్నాయి. కాగా,హిండెన్‌బర్గ్‌ “అనైతిక షార్ట్ సెల్లర్” అంటూ అదానీ గ్రూప్ దాడి చేసింది. న్యూయార్క్‌కు చెందిన ఈ సంస్థ పూర్తిగా తప్పుడు నివేదిక ఇచ్చిందని అదానీ గ్రూప్ ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో కొనసాగుతున్న విక్రయాల కారణంగా దాని ఫ్లాగ్‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ పూర్తిగా సబ్‌స్క్రైబ్ చేయబడిన 20,000 కోట్ల రూపాయల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను రద్దు చేసింది.

Rajasthan Budget 2023: ఫ్రీ స్కూటర్లు, ఫ్రీ బస్ పాస్, రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ‘ఎన్నికల బడ్జెట్’ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సీఎం గెహ్లాట్

ఇకపోతే, విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ముందస్తుగానే చెల్లించేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం తీవ్ర ఒడిదుడుకులతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ రుణాల చెల్లింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వ్యాపార విస్తరణ నిమిత్తం బ్యాంకుల నుంచి అదానీ గ్రూప్ 4.5 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ఇందులో కొంత రుణాన్ని మార్చి 9 నాటికి చెల్లించాలి.