Adani..Ambani : అంబానీ పవర్ ప్లాంట్‌ను అదానీ కొనేస్తారా..! ఆ దిశగా యత్నాలు
అంబానీ బొగ్గు ప్లాంట్ పై అదానీ కన్ను పడింది. దాన్ని దక్కించుకోవటానికి అదానీ గ్రూప్ యత్నాలు చేస్తోంది. దీని కోసం బిడ్లపై అదానీ ఫోకస్ పెట్టారు.

Adani..Ambani coal plants
Adani..Ambani coal plants : పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ(Anil Ambani)కి చెందిన పవర్ ప్లాంట్ ను ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ (Gautam Adani)కొనుగోలు చేస్తారా..? ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ (coal plants)ను కొనుగోలు చేయటానికి అదానీ ఆసక్తి చూపిస్తునారట. దీనికి సంబంధించి బిడ్ (bidding)పై అదానీ పరిశీలిస్తున్నారని బ్లూమ్ బర్గ్ మంగళవారం (జులై 11,2023) వెల్లడించింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని అనిల్ అంబానీ ఈ పవన్ ప్లాంట్ ను నిర్వహిస్తున్నారు. కానీ రుణాలు తిరిగి చెల్లించనలేని పరిస్థితిలో ఉన్నారు..దీంతో ఈ ప్లాంట్ వేలం వేయటానికి ఆ సంస్థకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. దీంతో అదానీ కన్ను ఆ ప్లాంట్ పై పడింది. దాన్ని దక్కించుకోటానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారని బ్లూబ్ బర్గ్ వెల్లడించింది.
పశ్చిమ భారతదేశంకలోని మహారాష్ట్ర(Maharashtra)లోని నాగ్ పూర్ (Nagpur)లో 600 మెగావాట్ల (600-megawatt)ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ (Ambani’s Reliance Power Ltd)కొనుగోలుకు అదానీ గ్రూప్ తీవ్ర ప్రయత్నం చేస్తోందని వెల్లడించింది. కాగా ఈ ప్లాంట్ ను దక్కించుకోవటానికి పలు సంస్థలు కూడా యత్నిస్తున్నాయి. దీంతో ఈ ప్లాంట్ దక్కించుకోవటానికి తీవ్ర పోటీ ఉంటుందని బ్లూమ్ బర్గ్ అభిప్రాయపడింది.
అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్ కూడా సంస్థపై నియంత్రణను తిరిగి పొందేందుకు ఆఫర్ ను అందజేస్తుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఈ ఇండస్ట్రీస్ 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను నిర్వహిస్తోంది. పవర్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంది. వీటిని చెల్లించని కారణంగా బ్యాంకులు పవర్ ప్లాంటును వేలం వేసేందుకు రెడీ అయ్యాయి. వ్యాపారాన్ని పెంచుకోవటానికి దేనికైనా వెనుకాడని అదానీ అనిల్ అంబానీకి చెందిన పవర్ ప్లాంట్ ను కొనుగోలు చేసి బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులో తన పరిధిని విస్తరించాలని అదానీ భావిస్తున్నారు.