Electricity Consumption: ‘హైదరాబాద్ హాస్టల్స్’లో నెలవారీ విద్యుత్ వినియోగాన్ని తగ్గింపు కోసం పీజీవో ఒప్పందం

ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్లు మెరుగ్గా విద్యుత్ వినియోగించటం, అతి తక్కువ విద్యుత్ బిల్లుల ఆవశ్యకత పెరుగుతుండటంతో ఇవి ప్రజాదరణ పొందాయి

Electricity Consumption: ‘హైదరాబాద్ హాస్టల్స్’లో నెలవారీ విద్యుత్ వినియోగాన్ని తగ్గింపు కోసం పీజీవో ఒప్పందం

Hyderabad Hostels: ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ (ITCHA) సహకారంతో నోయిడా-ఆధారిత రేడియస్ సినర్జీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (RSIPL) అందిస్తున్న అత్యాధునిక మీటరింగ్ సొల్యూషన్ “బిజ్లీ బడ్డీ”ని ప్రారంభించినట్లు వెల్లడించింది. హైదరాబాద్ హాస్టల్స్, పేయింగ్ గెస్ట్ (PG) సౌకర్యాలలో అధునాతన మీటరింగ్ సొల్యూషన్‌ను పరిచయం చేయాలనే లక్ష్యంతో ఉన్న RSIPL, ITCHAతో వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి PGO వ్యవస్థాపకుడు హరి కృష్ణ వెల్లడించారు.

Hyderabad: మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకేసిన 17 ఏళ్ల బాలిక

ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్లు మెరుగ్గా విద్యుత్ వినియోగించటం, అతి తక్కువ విద్యుత్ బిల్లుల ఆవశ్యకత పెరుగుతుండటంతో ఇవి ప్రజాదరణ పొందాయి. విద్యుత్తు కోసం ముందస్తుగా చెల్లించడానికి వినియోగదారులను అనుమతించడం ద్వారా, ఈ పరిష్కారం వారి విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ప్రీపెయిడ్ సిస్టమ్ వినియోగదారులకు విద్యుత్ ఖర్చులను నిర్వహించడానికి, ఆదాను ప్రోత్సహించడానికి ఎలా తోడ్పడుతుందో హరి వెల్లడించారు.

Best Smartphones India : రూ. 60వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే? తప్పక తెలుసుకోండి!

హైదరాబాద్ హాస్టళ్లలో మాత్రమే చూసుకుంటే దాదాపు 2,00,000 మీటర్ల అవసరం వుంది. వీటి ద్వారా నెలకు 7 మిలియన్ యూనిట్ల వరకు ఆదా చేయవచ్చట. ఇది ఇతర మార్కెట్‌లకు బెంచ్‌మార్క్‌ని సెట్ చేస్తుందని, వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచడంలో అధునాతన సాంకేతికతల విలువను నొక్కి చెబుతున్నారు.