Amazon Great Republic Day Sale : 2026లో అమెజాన్ ఫస్ట్ సేల్ డేట్ ఇదిగో.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!
Amazon Great Republic Day Sale : అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్‌కు సంబంధించి అనేక ప్రొడక్టులపై డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్ల వివరాలివే..
Amazon Great Republic Day Sale (Image Credit To Original Source)
- జనవరి 16 నుంచి అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం
- అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 లో 8PM డీల్స్ లిస్టింగ్
- SBI కార్డులతో 10శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్
- ఎలక్ట్రానిక్స్ నుంచి ఫ్యాషన్ వరకు వేలకొద్దీ డీల్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
Amazon Great Republic Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మరికొద్ది రోజులు ఆగండి.. అతి త్వరలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సేల్ అధికారిక తేదీలను ఈ-కామర్స్ దిగ్గజం ప్రకటించింది. ఈ రిపబ్లిక్ డే సేల్ జనవరి రెండో వారంలో ప్రారంభం కానుంది.
ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల నుంచి ఫ్యాషన్, హోం, కిచెన్ ప్రొడక్టుల వరకు ప్రతిదానిపై భారీ డిస్కౌంట్లను అందించనుంది. ప్రతి ఏడాది మాదిరిగానే, బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, లిమిటెడ్ డీల్స్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొత్త సంవత్సరంలో కస్టమర్‌లు భారీ తగ్గింపులను పొందవచ్చు.
జనవరి 16 నుంచి సేల్ ప్రారంభం :
అమెజాన్ ప్రకారం.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి 16న ప్రారంభమవుతుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, కెమెరాలు, అప్లియన్సెస్, ఆడియో డివైజ్, వేరబుల్ హౌస్, కిచెన్ అప్లియన్సెస్, ఆటో అప్లియన్సెస్, హెల్త్, పర్సనల్ ప్రొటెక్షన్ ప్రొడక్టులు, ఫ్యాషన్, స్లిప్పర్స్, బ్యూటీ ప్రొడక్టులు, ఫర్నిచర్, కిరాణా, బేబీ కేర్, పెట్ యానిమల్స్ ప్రొడక్టులు వంటి విభాగాలలో అద్భుతమైన ఆఫర్‌లు ఉంటాయి.

Amazon Great Republic Day Sale (Image Credit To Original Source)
వేలాది ప్రొడక్టులపై ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉంటాయని ఈ కామర్స్ దిగ్గజం పేర్కొంది. ఈ సేల్ సమయంలో, ఐక్యూ, వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ, ఆపిల్, సోనీ, టీసీఎల్, ఎల్‌జీ, హెచ్‌పీ, బోట్ వంటి మెయిన్ బ్రాండ్ల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను ఛాన్స్ ఉంది.
10శాతం బ్యాంకు ఆఫర్లు
అమెజాన్ మైక్రోసైట్ ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులపై కొనుగోళ్లకు 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ ఎస్బీఐ కార్డులతో చేసే ఈఎంఐ లావాదేవీలకు కూడా వర్తిస్తుంది.
పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అమెజాన్ ఈ సేల్ కోసం రోజువారీ 8PM డీల్స్, ట్రెండింగ్ డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్ విత్ ఎక్స్ఛేంజ్, టాప్ 100 డీల్స్ వంటి అనేక స్పెషల్ ఆఫర్లను అందించే అవకాశం ఉంది. అమెజాన్ కూపన్ల ద్వారా అదనపు సేవింగ్స్ కూడా పొందవచ్చు.
