Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లతో పనిలేదు.. ధర ఎంతంటే?

Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 6.1-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. రోజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ అనే మొత్తం 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ మోడల్ ఐఫోన్ 14 గత మోడళ్ల డిజైన్ కలిగి ఉంది.

Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లతో పనిలేదు.. ధర ఎంతంటే?

Apple iPhone 15 available ( Image Source : Google )

Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రపంచ టెక్ దిగ్గజం లేటెస్ట్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. గత ఏడాది వండర్‌లస్ట్ ఈవెంట్‌లో సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ కొత్త ఫోన్ 15 ఫీచర్లు, అప్ గ్రేడ్‌తో సంచలనం సృష్టించింది. మార్కెట్లోకి వచ్చినప్పుడు.. కొనుగోలుదారులు ఐఫోన్ కొనేందుకు ఆసక్తిని కనబర్చారు. భారత మార్కెట్లో ఆపిల్ కొత్త స్టోర్‌లకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఐఫోన్ ప్రారంభంలో 128జీబీ ఐఫోన్ 15 ధర రూ.79,900, 256జీబీ మోడల్ రూ.89,900, 512జీబీ వెర్షన్ రూ.1,09,900కు అందిస్తోంది.

Read Also : UPI One World Wallet : ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్.. కొత్త యూపీఐ వన్ వరల్డ్ వ్యాలెట్ సర్వీసు.. ఈజీ పేమెంట్స్!

ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్‌లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో 128జీబీ ఐఫోన్ 15 ధర రూ. 65,499కి అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ 15 లాంచ్ ధర కన్నా భారీగా తగ్గింది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించినా లేదా మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేస్తే ఇంకా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. ట్రేడ్-ఇన్ వాల్యూ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఎంచుకున్న క్రెడిట్ కార్డ్ నాన్-ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. వెయ్యి తగ్గింపు పొందవచ్చు.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 15 6.1-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. రోజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ అనే మొత్తం 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ మోడల్ ఐఫోన్ 14 గత మోడళ్ల డిజైన్ కలిగి ఉంది. అయితే, గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో మోడల్‌ల నుంచి పాపులర్ ఫీచర్ డైనమిక్ ఐలాండ్ నాచ్‌తో ట్రెడేషనల్ నాచ్‌ను అందిస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 15 మోడల్ 48ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో అప్‌గ్రేడ్‌ను కలిగి ఉంది. తక్కువ-కాంతిలో ఫొటోగ్రఫీ, అద్భుతమైన పోర్ట్రెయిట్ షాట్‌లను అందిస్తుంది. ఈ ఫోన్ “రోజంతా బ్యాటరీ లైఫ్” అందిస్తుందని ఆపిల్ పేర్కొంది. ఇటీవలి నివేదికలో బ్యాటరీ లైఫ్ ప్రారంభంలో కన్నా రెట్టింపుగా సూచిస్తుంది. ఐఫోన్ 15 మోడల్ 80 శాతం బ్యాటరీ హెల్త్ సామర్థ్యం 500 ఛార్జింగ్ సైకిళ్లను భరించగలదు. అదే, ఇప్పుడు ఐఫోన్ 15లోని బ్యాటరీ 1000 సైకిళ్లను తట్టుకోగలదని ఆపిల్ పేర్కొంది.

ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ ఎ16 బయోనిక్ చిప్‌తో ఆధారితమైనది. గత ఏడాదిలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఉపయోగించిన ఎ15 బయోనిక్ చిప్‌సెట్ నుంచి అప్‌గ్రేడ్ అయింది. ఐఫోన్ ప్రో మోడల్‌లు గత ఏడాదిలో ఎ16 చిప్‌ను అందుకున్నాయి. ఐఫోన్ 15లో యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ మారింది. ఆపిల్ లైటనింగ్ పోర్ట్ బదులుగా యూఎస్‌బీ టైప్-సీ ప్రమాణాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మీరు ఐఫోన్ 15 కొనేందుకు వేచి ఉంటే.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు.

Read Also : Acer Aspire 3D 15 Spatiallabs : ఏసర్ అస్పైర్ 3డీ 15 స్పాటియాల్యాబ్స్ ల్యాప్‌టాప్ ఇదిగో.. రియల్ టైమ్ 3డీ వ్యూ చూడొచ్చు..!