Apple iPhone 16 Pro : భలే ఆఫర్ భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 16 ప్రోపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఎంత తగ్గిందో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!
Apple iPhone 16 Pro : ఐఫోన్ 16 ప్రో ఆఫర్ అదిరింది.. విజయ్ సేల్స్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 16 ప్రో ఎలా కొనుగోలు చేయాలంటే?

Apple iPhone 16 Pro
Apple iPhone 16 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ 16 ప్రో కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? విజయ్ సేల్స్‌లో ఈ ఐఫోన్ మోడల్ రూ. 12,500 వరకు తగ్గింపు అందిస్తోంది. పాత ఐఫోన్ (Apple iPhone 16 Pro) నుంచి అప్‌గ్రేడ్ చేసుకునేవారికి బెస్ట్ ఆఫర్. అతి తక్కువ ధరకే ఐఫోన్ 16 ప్రో ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో డీల్ :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో రూ. 1,19,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 1,11,900కు లిస్ట్ అయింది. అయితే ఫ్లాట్ డిస్కౌంట్ రూ. 8వేలు తగ్గింపు పొందవచ్చు.
HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐలపై అదనంగా రూ. 4,500 తగ్గింపు పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈఎంఐపై రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Apple iPhone 16 Pro) :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో 6.3-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే HDR10, డాల్బీ విజన్‌కు సపోర్టు ఇస్తుంది. హుడ్ కింద ఐఫోన్ 16 ప్రో మోడల్ ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కలిగి ఉంది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ 25W వైర్డు, 15W వైర్‌లెస్, 4.5W రివర్స్ వైర్డు సపోర్ట్‌తో 3582mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.