Apple Retail Store : ముంబైలో ఫస్ట్ ఆపిల్ రిటైల్ స్టోర్.. ఈ 22 బ్రాండ్లకు నో ఎంట్రీ బోర్డు.. ఆపిల్ కొత్త రూల్ ఎందుకు పెట్టిందో తెలుసా?
Apple Retail Store : ఈ నెలాఖరులో ముంబైలో ఫస్ట్ ఆపిల్ రిటైల్ స్టోర్ ఓపెన్ చేయనుంది. ఈ స్టోర్ ప్రారంభానికి ముందే ఆపిల్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఆపిల్ పోటీదారులైన 22 బ్రాండ్లకు రిటైల్ స్టోర్ (Apple Retail Store) సమీపంలో ఎలాంటి షాపులు ఓపెన్ చేయడం, అడ్వర్టైజ్ మెంట్స్ ఇవ్వడానికి అనుమతి లేదు.

These 22 rival brands cannot open shops near first Apple retail store in Mumbai, here is why
Apple Retail Store : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) భారత్‌లో తమ మార్కెట్ మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అనేక సర్వీసులను అందిస్తున్న ఆపిల్.. అతి త్వరలో దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో ఫస్ట్ ఆఫ్‌లైన్ ఆపిల్ రిటైల్ స్టోర్ల (Apple Retail Store)ను ప్రారంభించనుంది. అంటే.. ఈ నెలాఖరులో ఆపిల్ తన ఫస్ట్ రిటైల్ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించనుంది. మొదటి స్టోర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలో ఉన్న జియో వరల్డ్ డ్రైవ్ మాల్ (Jio World Drive mall)లో ఓపెన్ చేయనుంది.
అధికారిక లాంచ్‌కు ముందు ఆపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ (Tim Cook) కూడా హాజరవుతారని అంటున్నారు. అయితే, రిటైల్ స్టోర్ లీజు-సంబంధిత వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆపిల్ ఒప్పందం ప్రకారం.. దేశంలో 22 పోటీదారు బ్రాండ్లను ఆపిల్ (Apple) తమ మొదటి స్టోర్ సమీపంలో ఎలాంటి షాపులను ఓపెన్ చేయడం లేదా అడ్వర్టైజ్ మెంట్స్ వంటి ప్రకటనలను ఇవ్వరాదంటూ కొత్త రూల్ పెట్టింది.
Read Also : Apple iPhone Users : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఈ ఐఫోన్లలో ఇకపై యాప్ స్టోర్, సిరి పనిచేయవు.. ఎందుకో తెలుసా?
ఈ నిబంధన ప్రకారం.. ఇతర ఆపిల్ పోటీదారు బ్రాండ్లైన Amazon, Facebook, Google, LG, Microsoft, Sony, Twitter, Bose, Dell, Devialet, Foxconn, Garmin, Hitachi, HP, HTC , IBM, Intel, Lenovo, Nest, Panasonic, Toshiba, Samsung వంటి కంపెనీలు ఆపిల్ జోన్లో తమ స్టోర్లను ఓపెన్ చేయడానికి అనుమతి లేదు. ఈ నివేదికలో మొత్తం 22 ఇతర కంపెనీల పేర్లను వెల్లడించింది.
ముంబై మాల్తో ప్రతి మూడేళ్లకు 15 శాతం అద్దె పెంపు నిబంధనతో 11 ఏళ్లకు పైగా ఆపిల్ లీజును కలిగి ఉందని డీల్ పేర్కొంది. ఆపిల్ మూడు ఏళ్ల ఆదాయ వాటాలో 2 శాతంతో పాటు నెలకు రూ. 42 లక్షల ‘కనీస గ్యారెంటీ’ కూడా చెల్లిస్తుందని నివేదిక పేర్కొంది. ఆ తర్వాత రెవెన్యూ వాటాలో 2.5 శాతం ఆపిల్ చెల్లిస్తుందని తెలిపింది.

These 22 rival brands cannot open shops near first Apple retail store in Mumbai, here is why
ఏది ఏమైనప్పటికీ, ఆపిల్ భారత మార్కెట్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రయత్నాల్లో ఈ దిశగా చర్యలు చేపడుతోంది. టెక్ దిగ్గజం గత 6 ఏళ్లుగా స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. పరిశోధనా సంస్థ IDC ప్రకారం.. 2023లో 60 శాతం వాటాతో ఆపిల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో (రూ. 41వేలు కన్నా ఎక్కువ) అగ్రస్థానంలో నిలిచింది. ఆపిల్ సైతం నెమ్మదిగా భారత్, ఇతర దేశాలకు తయారీ కేంద్రాలను విస్తరిస్తోంది. ఇప్పటికే ఆపిల్ ఐఫోన్ 14 మోడల్‌ను భారత్‌లో తయారు చేసింది. ముంబైలో తన ఫస్ట్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించిన తర్వాత ఆపిల్ ఢిల్లీలోని (Citywalk Mall in Saket) మరో స్టోర్‌ను ప్రారంభించనుంది.
ఈ రెండో స్టోర్ 10వేల చదరపు అడుగులతో చిన్నదిగా ఉండనుంది. ఆపిల్ మరో 25 దేశాలలో 500కి పైగా రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసింది. ఈ ఆఫ్‌లైన్ స్టోర్లను హై-ట్రైన్డ్ ఆపిల్ ఎగ్జిక్యూటివ్లచే కంపెనీ రన్ చేస్తోంది. ఈ షాపులు వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోలు చేసిన డివైజ్‌లను పిక్ అప్ చేసేందుకు అనుమతిస్తాయి. ఆపిల్ ‘టుడే ఎట్ ఆపిల్’ ప్రోగ్రామ్‌ను కూడా నిర్వహిస్తుంది. కంపెనీ తన ప్రొడక్టుల డెమోలను వినియోగదారులకు అందించడానికి క్రియేటర్లతో కలిసి పనిచేస్తోంది.
Read Also : First Apple Offline Stores : భారత్‌లో ఫస్ట్ ఆపిల్ ఆఫ్‌లైన్ స్టోర్లు.. ఈ రెండు నగరాల్లోనే.. లాంచ్ ఎప్పుడంటే?