James Bond: జేమ్స్‌బాండ్ కార్లు.. అమ్మకానికి సిద్ధం.. స్పెషల్ ఇదే!
జేమ్స్‌బాండ్.. సీక్రెట్ ఏజెంట్‌గా సినిమాల్లో సూపర్ స్టైల్‌తో కనిపించే క్యారెక్టర్.. జేమ్స్ బాండ్ చేసే ప్రతీ పని స్క్రీన్‌పై ప్రత్యేకమే.

Car
James Bond: జేమ్స్‌బాండ్.. సీక్రెట్ ఏజెంట్‌గా సినిమాల్లో సూపర్ స్టైల్‌తో కనిపించే క్యారెక్టర్.. జేమ్స్ బాండ్ చేసే ప్రతీ పని స్క్రీన్‌పై ప్రత్యేకమే. జేమ్స్ బాండ్ సినిమాల్లో కనిపించే కారు ఎంఐ6 కారు కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఏజెంట్ ఉపయోగించే స్పెషల్ కారుని సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు బాండ్ వాడే కార్లు అన్నింటినీ ఆస్టోన్-మార్టిన్ సంస్థ తయారు చేయగా త్వరలో విడుదల కాబోతున్న నో టైం టూ డై సినిమా కోసం స్పెషల్ ఎడిషన్ కార్లను సిద్ధం చేస్తుంది. డీబీ 5 జూనియర్ పేరుతో ఈ కార్లను తయారు చేస్తుంది.
క్లాసిక్ 007-ప్రేరేపిత కారు బాండ్ చలనచిత్రాల మాదిరిగానే అనేక గాడ్జెట్‌లను కలిగి ఉంది. ఈ గాడ్జెట్‌లలో హెడ్‌లైట్ల వెనుక రెండు సిమ్యులేటెడ్ గ్యాట్లింగ్ గన్‌లు, స్కిడ్ మోడ్, డిజిటల్ నంబర్ ప్లేట్, హిడెన్ గాడ్జెట్స్ స్విచ్ ప్యానెల్ మరియు టెయిల్‌పైప్ నుంచి విడుదలయ్యే స్మోక్ స్క్రీన్ ఉన్నాయి. స్పెషల్ ఎడిషన్ స్కేల్ మోడల్ అనేది ప్రతి గూఢచారి కిడ్ కల. 80 మైళ్ల శ్రేణి సామర్థ్యం కలిగిన పూర్తి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. ఇది పునరుత్పత్తి బ్రేకింగ్, బ్రెంబో డిస్క్ బ్రేకులు, బిల్‌స్టెయిన్ డంపర్‌లు మరియు కాయిలోవర్ స్ప్రింగ్‌లను పొందుతుంది.
Introducing the DB5 Junior NO TIME TO DIE Edition.#AstonMartin #LicenceToThrill #NoTimeToDie
— Aston Martin (@astonmartin) September 21, 2021
శత్రువులపై పోరాడేందుకు.. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు వీలుగా బాండ్ కార్లలో అధునాతమైన ఆయుధాలు, గ్యాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. డీబీ 5 జూనియర్‌లో గ్యాడ్జెట్లు వెపన్స్ పొందుపరిచారు. జేమ్స్‌బాండ్ స్పెషల్ ఎడిషన్ డీబీ 5 జూనియర్‌లో డిజిటల్ నంబర్ ప్లేట్.. ఇందులో నంబర్లు ఆటోమేటిక్‌గా మారిపోతూ ఉంటాయి. అంతేకాదు స్విచ్ నొక్కితే చాలు హెడ్‌లైట్ల స్థానంలో గన్స్ వచ్చేస్తాయి. స్మోక్ స్క్రీన్, హిడ్డెన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి అనేక ఫీచర్లు అందులో ఉన్నాయి.
Raw and instinctive – Vantage deserves to be driven.
Watch @007 put his Aston Martin to the test in NO TIME TO DIE from 30th September.#NoTimeToDie #AstonMartin #LicenceToThrill pic.twitter.com/TIvZ7ArdX1
— Aston Martin (@astonmartin) August 31, 2021
ఆస్టోన్-మార్టిన్ సంస్థ ఎలక్ట్రిక్ కారుగా డీబీ-5 జూనియర్‌ని రూపొందించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 మైళ్ల దూరం ప్రయాణించే ఈ కారు ధరని 90వేల డాలర్లుగా నిర్ణయించగా.. కారు తీసుకోవాలని అనుకునేవారు ఆస్టోన్ మార్టిన్ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్టోన్-మార్టిన్ సంస్థ కేవలం 125కార్లను మాత్రమే తయారు చేసింది.
జేమ్స్‌బాండ్ సినిమాలు గత, వర్తమాన మరియు భవిష్యత్తు నుంచి నాలుగు దిగ్గజ ఆస్టన్-మార్టిన్ మోడళ్లను కలిగి ఉండగా, రాబోయే చిత్రం ‘నో టైమ్ టు డై’ మొదటిసారిగా నాలుగు వేర్వేరు ఆస్టన్-మార్టిన్ నమూనాలు 007 చిత్రంలో కనిపించాయి D-B5, క్లాసిక్ ఆస్టన్ మార్టిన్ V8, సూపర్ GT – DBS మరియు ఆస్టన్ మార్టిన్ వాల్‌హల్లా.