Ather EV Scooter : ఓలా, TVSకు పోటీగా.. ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఏథర్ బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది.. అతి చౌకైన ధరకే..!
Ather EV Scooter : ఏథర్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అతి చౌకైన ధరకే లాంచ్ చేసే అవకాశం ఉంది.

Ather EV Scooter
Ather EV Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తు్న్నారా? భారత మార్కెట్లో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలలో ఒకటైన ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో చౌకైన (Ather EV Scooter) స్కూటర్‌ను ప్రవేశపెట్టేందకు రెడీ అవుతోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో ఆగస్టు 2025 నాటికి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించాలని కంపెనీ భావిస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో పాటు బడ్జెట్ ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కోరుకునే కస్టమర్ల కోసం తీసుకురానుంది. రాబోయే ఏథర్ ఈవీ స్కూటర్ కు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
ఏథర్ థర్డ్ కమ్యూనిటీ దినోత్సవం :
ఆగస్టు 2025 చివరి నాటికి ఏథర్ మూడవ కమ్యూనిటీ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సాధారణంగా ఏథర్ ఈ దినోత్సవం సందర్భంగా లేటెస్ట్ ప్రొడక్టులు, అప్‌డేట్స్ ఆవిష్కరిస్తుంటుంది. ఏథర్ రిజ్టా స్కూటర్, ఏథర్‌స్టాక్ 6.0 సాఫ్ట్‌వేర్, హాలో స్మార్ట్ హెల్మెట్ అన్నీ గత ఏడాది ఇదే ఈవెంటులోనే ప్రకటించింది. ఈసారి ఏథర్ సరికొత్త అతి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురాబోతుంది.
ఈఎల్ (EL) ప్లాట్‌ఫామ్ ఏంటి? :
కొత్త స్కూటర్‌ను కంపెనీ EL ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల నిర్మాణం కోసం ఏథర్ కొత్త జనరేషన్ ప్లాట్‌ఫామ్. మెరుగైన పవర్‌ట్రెయిన్, కొత్త బ్యాటరీ టెక్నాలజీ, కొత్త ఎలక్ట్రానిక్స్‌లను కలిగి ఉంటుంది. ఈ ఈఎల్ ప్లాట్‌ఫామ్‌ను భారత్ కోసం మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్ల కోసం కూడా రూపొందించింది. ఏథర్ ప్రస్తుత 450 ప్లాట్‌ఫామ్, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్, ఏథర్‌స్టాక్ నుంచి కొన్ని ఫీచర్లను కూడా అందించనుంది.
అదేవిధంగా, ఏథర్ 2024 ఏప్రిల్‌లో రిజ్టాను ఫ్యామిలీ స్కూటర్‌గా ప్రవేశపెట్టింది. కస్టమర్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ కూడా పొందింది. కంపెనీ ప్రస్తుతం ఎక్కువ మంది కస్టమర్లను లక్ష్యంగా ఈ కొత్త సరసమైన స్కూటర్‌పై దృష్టి సారించింది. రిజ్టా సక్సెస్‌తో ధర, పర్ఫార్మెన్స్ అందించే ఈవీలపై ఆసక్తి చూపుతున్నారు.
కొత్త ఫీచర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ (అంచనా) :
అతి త్వరలో ఏథర్ ఫాస్ట్ ఛార్జర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయనుంది. నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ ఛార్జర్‌లు వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన ఛార్జింగ్‌ను అందిస్తాయి. ఏథర్‌స్టాక్ 7.0 కూడా ప్రారంభించనుంది. ఏథర్ స్కూటర్లలో పర్ఫార్మెన్స్, కనెక్టివిటీ కోసం మరింత మెరుగైన సాఫ్ట్‌వేర్‌ను అందించనుంది.
ఓలా, టీవీఎస్‌లకు గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా ఈ కొత్త ఈవీ స్కూటర్ లాంచ్ చేయనుంది ఏథర్. ప్లాట్‌ఫామ్, ఫాస్ట్ ఛార్జింగ్, మెరుగైన సాఫ్ట్‌వేర్ సపోర్టుతో అతి చౌకైన ధరకే స్కూటర్ అందించనుంది. స్పీడ్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఈ కొత్త అథర్ మోడల్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.