Auto Sales November 2024 : నవంబర్‌లో జోరుగా విక్రయాలు.. 10శాతం పెరిగిన మారుతీ అమ్మకాలు.. ఆటో సేల్స్ ఎలా ఉన్నాయంటే?

Auto Sales November 2024 : నవంబర్ 2024లో మారుతీ సుజుకి మొత్తం 1.81 లక్షల వాహనాల అమ్మకాలను నివేదించింది. నివేదిక ప్రకారం.. 1.77 లక్షల యూనిట్ల కన్నా ఎక్కువనే అమ్మకాలను సాధించింది.

Auto Sales November 2024 : నవంబర్‌లో జోరుగా విక్రయాలు.. 10శాతం పెరిగిన మారుతీ అమ్మకాలు.. ఆటో సేల్స్ ఎలా ఉన్నాయంటే?

Hyundai Motor india to Maruti suzuki Tata motors

Updated On : December 1, 2024 / 7:24 PM IST

Auto Sales November 2024 : ఆటో రంగ కంపెనీలు గత నెలలో అమ్మకాల గణాంకాలను డిసెంబర్ 1న విడుదల చేశాయి. నవంబర్ నెలలో దేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ మారుతీ సుజుకీ 1.81 లక్షల వాహనాలను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన 10.4 శాతం ఎక్కువ అని చెప్పవచ్చు.

మరోవైపు, 2024 నవంబర్‌‌లో వార్షిక ప్రాతిపదికన టాటా మోటార్స్ అమ్మకాలు 0.8 శాతం స్వల్పంగా పెరిగాయి. ఇది కాకుండా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, ఎస్కార్ట్స్ కుబోటా, టయోటా ఇండియా వంటి అన్ని ప్రముఖ కంపెనీల అమ్మకాల గణాంకాలు కూడా నమోదయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

మారుతీ సుజుకి :
నవంబర్ 2024లో మారుతీ సుజుకి మొత్తం 1.81 లక్షల వాహనాల అమ్మకాలను నివేదించింది. సీఎన్‌బీసీ-టీవీ18 అంచనా వేసిన 1.77 లక్షల యూనిట్ల కన్నా ఎక్కువ. అదే సమయంలో, నవంబర్ 2023లో 1.64 లక్షల యూనిట్ల కన్నా 10.4 శాతం ఎక్కువ.

మారుతీ సుజుకి దేశీయ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 8.1శాతం వృద్ధి చెంది 1.53 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 5.3శాతం వృద్ధితో 1.41 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయంగా బలమైన డిమాండ్ కారణంగా కంపెనీ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 24.8 శాతం పెరిగి 28,633 యూనిట్లకు చేరుకున్నాయి.

టాటా మోటార్స్ :
టాటా మోటార్స్ 74753 యూనిట్ల మొత్తం అమ్మకాలతో స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. సీఎన్‌బీసీ-టీవీ18 అంచనా వేసిన 74200 యూనిట్ల కన్నా కొంచెం ఎక్కువ. నవంబర్ 2023లో 74,172 యూనిట్ల నుంచి 0.8 శాతం స్వల్ప పెరుగుదల కనిపించింది. దేశీయ విక్రయాలు కూడా కేవలం ఒక శాతం వృద్ధితో 73,246 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, వాణిజ్య వాహనాల విభాగం 1 శాతం క్షీణించి 26183 యూనిట్లకు చేరుకుంది.

టీవీఎస్ మోటార్ :
టీవీఎస్ మోటార్ అద్భుతమైన నెలను కలిగి ఉంది. మొత్తం 4.01 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. మార్కెట్ అంచనా 3.87 లక్షల యూనిట్ల కన్నా చాలా ఎక్కువ. నవంబర్ 2023లో 3.64 లక్షల యూనిట్ల నుంచి 10.2 శాతం వార్షిక పెరుగుదలను సూచిస్తుంది. ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 12 శాతం వృద్ధితో 3.92 లక్షల యూనిట్లకు చేరుకోగా, కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 57 శాతం వృద్ధితో 26,292 యూనిట్లకు చేరాయి.

టయోటా కిర్లోస్కర్ మోటార్ :
టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు నవంబర్ 2023లో 17818 యూనిట్ల నుంచి నవంబర్ 2024 నాటికి 44శాతం పెరుగుదలతో 25586 యూనిట్లకు పెరిగాయి. టయోటా భారతీయ పోర్ట్‌ఫోలియోలో కీలక స్తంభమైన ఎస్‌యూవీలకు క్రమంగా పెరుగుతున్న డిమాండ్ ద్వారా కంపెనీ లాభపడింది.

అదేవిధంగా, ఎంజీ మోటార్ ఇండియా మొత్తం 6019 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది కన్నా 20శాతం ఎక్కువ. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేవలం, విండ్సర్ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ అమ్మకాలు 3,144 యూనిట్లుగా ఉన్నాయి. భారత మార్కెట్లో ఈవీలకు పెరుగుతున్న ప్రజాదరణను సూచిస్తుంది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా :
నవంబర్ 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) మొత్తం 61252 వాహనాల అమ్మకాలను సాధించింది. ఇందులో 48,246 దేశీయ అమ్మకాలు, 13,006 ఎగుమతులు ఉన్నాయి. ఎస్‌యూవీలు దేశీయ విక్రయాలలో ఆధిపత్యాన్ని కొనసాగించాయి.

మొత్తం అమ్మకాలలో 68.8 శాతం వాటాను అందించాయి. ముఖ్యంగా, భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో బలమైన డిమాండ్‌ ఆధారంగా హెచ్ఎమ్ఐఎల్ తన అత్యధిక గ్రామీణ సహకారాన్ని 22.1శాతం నమోదు చేసింది. వినూత్నమైన హై-సీఎన్‌జీ డ్యుయో టెక్నాలజీ సీఎన్‌జీ వాహనాల అమ్మకాలను కూడా పెంచింది. దాంతో మొత్తం అమ్మకాలలో 14.4 శాతంగా ఉంది.

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా :
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా గత ఏడాదిలో ఇదే నెలతో పోలిస్తే.. నవంబర్ 2024లో హోల్‌సేల్స్‌లో 20శాతం వృద్ధిని నమోదు చేసి 6019 యూనిట్లకు చేరుకుంది. కంపెనీ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ విండ్సర్ 3,144 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. వరుసగా రెండవ నెలలో బలంగా ఊపందుకుంది. కొత్త పవర్ వాహనాలు (NEV) మొత్తం నెలవారీ అమ్మకాలలో 70 శాతం వాటా కలిగి ఉన్నాయి.

ఎస్కార్ట్స్ కుబోటా :
ఎస్కార్ట్స్ కుబోటా విక్రయాలు నవంబర్ 2024లో సంవత్సరానికి 9.4శాతం క్షీణించి మొత్తం 8,974 యూనిట్లకు చేరుకున్నాయి. కంపెనీ దేశీయంగా 8,730 ట్రాక్టర్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే 8.1శాతం క్షీణించింది. కంపెనీ ఎగుమతులు కూడా 39.5శాతం క్షీణించి 244 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, పండుగ నెలల్లో (సెప్టెంబర్-నవంబర్) ఎస్కార్ట్స్ ట్రాక్టర్ విక్రయాల్లో 9శాతం వృద్ధితో 38,554 యూనిట్లకు చేరుకుంది.

టయోటా ఇండియా :
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా 2024 నవంబర్‌లో అమ్మకాలలో 44శాతం వృద్ధిని నమోదు చేసి 25,586 యూనిట్లకు చేరుకుంది. గత ఏడాదిలో 17,818 యూనిట్లతో పోలిస్తే.. కంపెనీ ఎస్‌యూవీలకు బలమైన డిమాండ్ కారణంగా ధరలను పెంచేసింది.

Read Also : LPG Price Hike : షాకింగ్ న్యూస్.. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే?