2024 Car Prices Hike : 2024 జనవరిలో పెరగనున్న మారుతీ సుజుకీ కార్ల ధరలు.. వెంటనే కొనేసుకోండి!

2024 Car Prices Hike : మీరు కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? 2024 జనవరి నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. కారు కొనాలంటే ఇప్పుడే కొనేసుకోండి.

2024 Car Prices Hike : 2024 జనవరిలో పెరగనున్న మారుతీ సుజుకీ కార్ల ధరలు.. వెంటనే కొనేసుకోండి!

Maruti Suzuki to increase car prices in January 2024

Updated On : November 28, 2023 / 12:04 AM IST

2024 Car Prices Hike : కొత్త కారు కోసం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? వచ్చే ఏడాదిలో మారుతీ కార్ల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2024 జనవరిలో కార్ల ధరల పెంపుపై బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. పెరిగిన ధరల ఒత్తిడి, ద్రవ్యోల్బణం, నిర్వహణ ఖర్చుల కారణంగా కార్ల ధరలను అమాంతం పెంచనున్నట్టు తెలిపింది. ఆటోమొబైల్ మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరగడం సహా ముడిసరకు ధరలు పెరగడంతో కార్ల ధరలను భారీగా పెంచనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

వచ్చే జనవరి నుంచి కొత్త ధరలు అమల్లోకి :

మొత్తం ద్రవ్యోల్బణం, పెరిగిన కమోడిటీ ధరల కారణంగా పెరిగిన వ్యయ ఒత్తిడితో జనవరి 2024లో తమ కార్ల ధరలను పెంచాలని కంపెనీ యోచిస్తోందని మారుతి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ కొత్త ధరల పెంపు వచ్చే జనవరి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కార్ల ధరలను ఎంత శాతం వరకు పెంచనుందో కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.

Read Also : Budget Friendly Smartwatches : ఈ నవంబర్‌ 2023లో టాప్ రేటింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌వాచ్‌లు ఇవే!

కార్ల మోడళ్ల ఆధారంగా ధరలను పెంచే అవకాశం ఉందని మారుతీ సుజుకీ స్పష్టం చేసింది. ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, ఈకో, సెలిరియో, వ్యాగన్‌ఆర్, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, సియాజ్, ఫ్రాంక్స్, బ్రెజ్జా, జిమ్నీ, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్, ఇన్‌విక్టో వంటి మోడళ్లను మారుతి విక్రయిస్తోంది. సంస్థ అత్యంత సరసమైన కారు ఆల్టో కె10 ఒకటిగా చెప్పవచ్చు.

Maruti Suzuki to increase car prices in January 2024

Maruti Suzuki car prices

మోడల్ బట్టి ధరల పెంపు :
ఈ కారు మోడల్ ధర రూ. 3.99 లక్షలతో ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్). అదే ఫ్లాగ్‌షిప్ మోడల్, ఇన్విక్టో, రూ. 28.42 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కంపెనీ ఖర్చును తగ్గించడానికి, పెరుగుదలను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. మారుతి ప్రతి కారుపై ధరల పెంపు పరిమాణాన్ని పేర్కొననప్పటికీ, ధరల పెరుగుదల మోడళ్లలో మారుతుందని పేర్కొంది. జనవరి 2024లో జరగబోయే ధరల పెంపు ఎఫ్‌వై24లో మారుతి తీసుకున్న రెండవది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటిది. ఏప్రిల్ 2023లో మోడల్‌లలో దాదాపు 0.8శాతం సగటుతో ధరలను పెంచింది. జనవరి 2023లో కూడా మారుతీ కార్ల ధరలను 1.1శాతం పెంచింది. గత అక్టోబర్‌‌లో మారుతీ సుజుకీ సేల్స్ భారీగా పెరిగాయి. ఒక నెలలోనే అత్యధికంగా 1,99,217 యూనిట్లను విక్రయించి రికార్డు నెలకొల్పింది. అంటే.. ఏడాదితో పోలిస్తే 19 శాతం ఎక్కువగా ఉంది.

Read Also : Apple Phone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై ఏకంగా రూ.12వేలు డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!