Bank Holidays June 2025 : జూన్‌లో 12 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏయే తేదీల్లో పనిచేయవంటే? ఫుల్ లిస్ట్ ఇదిగో..!

Bank Holidays June 2025 : జూన్ నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులు పనిచేయవు. పబ్లిక్, పండగ సెలవులకు సంబంధించి ఫుల్ లిస్ట్ ఓసారి చెక్ చేసుకోండి.

Bank Holidays June 2025 : జూన్‌లో 12 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏయే తేదీల్లో పనిచేయవంటే? ఫుల్ లిస్ట్ ఇదిగో..!

Bank Holidays June 2025

Updated On : May 26, 2025 / 5:47 PM IST

Bank Holidays June 2025 : జూన్ నెల వచ్చేస్తోంది. మీకు బ్యాంకులో పని ఉందా? ఏదైనా ముఖ్యమైన బ్యాంకింగ్ పని కోసం వెళ్లవలసి ఉందా? అయితే ఇది మీకోసమే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జూన్ కు సంబంధించి బ్యాంకు హాలిడేస్ జాబితాను ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు బ్యాంకులకు 12 రోజుల సెలవులను ప్రకటించింది. నెల మొత్తంలో 12 రోజులు బ్యాంకు సెలవులు ఉంటాయి.

Read Also :  Ayushman Card : ఆయుష్మాన్ హెల్త్ కార్డు.. 70ఏళ్లు పైబడితే అప్లయ్ చేయొచ్చు.. రూ. 5 లక్షల వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్‌మెంట్..!

అందులో వారాంతపు సెలవులు అన్ని ఆదివారాలు, రెండో, నాల్గవ శనివారాలు ఉన్నాయి. పండుగల సమయంలో మరో 6 రోజులు బ్యాంకులు మూతపడతాయి. ఈ సెలవుల్లో బ్యాంకుల్లో ఎలాంటి లావాదేవీలు జరగవు.

వచ్చే నెలలో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ముందుగానే ఆయా బ్యాంకు పనులను పూర్తి చేసుకోవడం మంచిది. ఇంతకీ ఏయే తేదీల్లో బ్యాంకులు పనిచేయవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

జూన్ 2025 లో బ్యాంకులకు సెలవుదినాలివే :

పబ్లిక్ హాలిడేస్ :
జూన్ 6 (శుక్రవారం) : ఈద్-ఉల్-అధా (బక్రీద్) : అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
జూన్ 7 (శనివారం) : బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) : బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన నగరాలతో సహా దేశంలోని చాలా ప్రాంతాలలో బ్యాంకులు పనిచేయవు.
జూన్ 11 (బుధవారం) : సంత్ గురు కబీర్ జయంతి : సిక్కిం, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు పనిచేయవు.
జూన్ 27 (శుక్రవారం) : రథయాత్ర : ఒడిశా, మణిపూర్‌లలో బ్యాంకులు పనిచేయవు.
జూన్ 30 (సోమవారం) : రెమ్నా ని : మిజోరంలో బ్యాంకులు పనిచేయవు.

వారాంతపు సెలవులు :
జూన్ 1 (ఆదివారం)
జూన్ 8 (ఆదివారం)
జూన్ 14 ( రెండో శనివారం)
జూన్ 15 (ఆదివారం)
జూన్ 22 (ఆదివారం)
జూన్ 28 (నాల్గో శనివారం)
జూన్ 29 (ఆదివారం)

యధావిధిగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు :
బ్యాంకు సెలవుల్లో నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్, యూపీఐ, వ్యాలెట్, ఏటీఎం వంటి డిజిటల్ సర్వీసులు పనిచేస్తాయి. ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలు చేయవచ్చు. చెక్కు డిపాజిట్, డ్రాఫ్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది.

Read Also : Motorola Edge 50 Pro 5G : బిగ్ డిస్కౌంట్.. చౌకైన ధరకే మోటోరోలా ఎడ్జ్ 50ప్రో 5G ఫోన్.. అద్భుతమైన డీల్ డోంట్ మిస్..!

ఈ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలి. మీ ప్రాంతంలోని బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి సెలవులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.