ప్లీజ్ చెక్ : ఈ ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి
ఆర్థిక సంవత్సరం చివరి రోజైన ఈ ఆదివారం(మార్చి 31, 2019) బ్యాంకులు పని చేస్తాయని ఆర్బీఐ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ప్రభుత్వంతో జరిపే

ఆర్థిక సంవత్సరం చివరి రోజైన ఈ ఆదివారం(మార్చి 31, 2019) బ్యాంకులు పని చేస్తాయని ఆర్బీఐ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ప్రభుత్వంతో జరిపే
ఈ ఆదివారం(మార్చి 31, 2019) బ్యాంకులు పని చేస్తాయని ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడమే ఇందుకు కారణం. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ప్రభుత్వంతో జరిపే అన్ని ఆర్థిక లావాదేవీలు నిరాటంకంగా సాగటానికి అన్ని బ్యాంకులు తమ శాఖలను తెరిచి ఉంచాలని ఆర్బీఐ సూచించింది. ప్రభుత్వ ఆదాయ, చెల్లింపులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సెంట్రల్ బ్యాంక్ ఈ సర్క్యూలర్‌ను జారీచేసింది.
శనివారం రాత్రి 8 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వరంగ బ్యాంకులు పనిచేయనున్నాయి. అలాగే ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ద్వారా ఆర్థిక లావాదేవీలను జరుపుకునే అవకాశం కూడా కల్పించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయ పన్ను చెల్లింపుల గడువు మార్చి 31వ తేదీతో ముగుస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also : డెడ్‌లైన్.. 4 రోజులే : పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా?